చిన్నారి గొప్ప మ‌న‌సు.. రోడ్డు ప‌క్క‌న అవ‌స్థ‌లు ప‌డుతున్న గ‌ర్భిణికి సాయం..

సాయం చేయ‌డానికి వ‌య‌సుతో సంబంధం లేదు.చేయాల‌న్న త‌ప‌న ఉంటే చాలు అని ఇప్ప‌టికే ఎన్నో ఘ‌ట‌న‌లు నిరూపించాయి.

 Child Is A Great Mind Help A Pregnant Woman Who Is Suffering From Roadside Condi-TeluguStop.com

ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది.ఓ చిన్నారి చేసిన సాయం అంద‌రి మ‌న‌సుల‌ను క‌దిలిస్తోంది.

ఇప్పుడున్న రోజుల్లో సొంత వారినే స‌రిగ్గా ప‌ట్టించుకోవ‌ట్లేదు.అలాంటి ఓ రోడ్డు ప‌క్క‌న ఉన్న గ‌ర్భిణికి ఆ చిన్నారి అతి పెద్ద సాయ‌మే చేసేసింది.

ఇంకా చెప్పాలంటే ఆమె ప్రాణాన్ని నిల‌బెట్టింది.ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ చెక్క‌ర్లు కొడుతోంది.

అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏపీలోని అనంతపురం జిల్లాలో ఈ అరుదైన ఘటన జ‌రిగింది.

ప‌ట్ట‌ణంలోని ఓ రోడ్డు మీదుగా ఆటోలో ఓ గ‌ర్భిణి హాస్పిట‌ల్‌కు వెళ్తుంది.ఆమెకు అప్ప‌టికే నొప్పులు స్టార్ట్ అయ్యాయి.

అయితే మ‌ధ్య‌లో ఆటో టైర్ పంక్చ‌ర్ అయింది.దీంతో డ్రైవర్ అటుగా వెళ్లే వాహ‌నాల‌ను ఆప‌డం స్టార్ట్ చేశాడు.

ఎవ‌రైనా ఆపితే ఆ గ‌ర్భిణిని అందులో పంపించేయాల‌ని చూస్తున్నారు.కానీ స‌మ‌యానికి ఎవ‌రూ వాహ‌నం ఆప‌ట్లేదు.

ఓ వైపు ఆటోలో ఉన్న గ‌ర్భిణి నొప్పుల‌తో అల్లాడిపోతోంది.కాగా ఇదే స‌మ‌యంలో అటుగా ఓ న‌ల్ల కారు వెళ్ల‌గా దాన్ని ఆటో డ్రైవ‌ర్ ఆపాడు.

కానీ ఆప‌కుండా ముందుకు వెళ్లిన ఆ కారు ఎందుకో రివ‌ర్స్ వ‌స్తోంది.అందులోంచి ఓ చిన్నారి దిగి మహిళను పరామర్శించింది.వెంట‌నే కారులో ఉన్న వాటర్‌ బాటిల్ ఇచ్చి, ఆ త‌ర్వాత కారులోప‌ల ఉన్న త‌న తండ్రిని ఆమెకు సాయం చేయాలంటూ అడిగింది.వెంట‌నే ఆ కారులో ఉన్న వ్య‌క్తి దిగి వ‌చ్చి ఆమెను చేతుల మీద ఎత్తుకుని త‌న కారులో ఎక్కించుకుని తీసుకెళ్తాడు.

ఇక ఆ త‌ర్వాత ఆటో డ్రైవ‌ర్ వారికి చేతులెత్తి మొక్క‌డం క‌నిపిస్తుంది.సినిమా స్టైల్ లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఇప్పుడు అంద‌రినీ క‌లిచి వేస్తోంది.ఆ చిన్నారిని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube