టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ప్రెసెంట్ బంగార్రాజు సినిమా చేస్తున్నాడు.కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
బంగార్రాజు సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సోగ్గాడే చిన్నినాయన అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది.
ఇక ఇప్పుడు కూడా ఈ సినిమాను అంతే ఎనర్జిటిక్ గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్.
ఇక ఈ సినిమాలో నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో నాగార్జున కు జంటగా రమ్య కృష్ణ నటిస్తుండగా.నాగ చైతన్య కు జంటగా కృతి శెట్టి నటిస్తుంది.
ఈ మధ్యనే షూటింగ్ స్టార్ట్ చేసిన బంగార్రాజు సినిమా జట్ స్పీడ్ తో షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.ఈ క్రమంలోనే బంగార్రాజు టీమ్ అక్కినేని అభిమానులకు వరుస ట్రీట్స్ రెడీ చేస్తుంది.
ఈ మధ్యనే కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన మేకర్స్ ఇక ఇప్పుడు మరొక రెండు అప్డేట్ లను రెడీ చేసింది.
ఈ మేరకు ఓకే పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.వరుసగా రెండు అప్డేట్ లను విడుదల చేస్తున్నట్టు ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.నవంబర్ 22న సాయంత్రం 5.22 గంటలకు బంగార్రాజు ఫస్ట్ లుక్ ను రివీల్ చేయబోతున్నారు.
వెంటనే నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా 23న ఉదయం 10.23 గంటలకు టీజర్ ను విడుదల చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు.దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ప్రెసెంట్ బంగార్రాజు షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది.ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా.
జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.