పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద లైన్ క్లీయర్ అవ్వాల్సిందే.ఆయన సినిమా విడుదల తేదీ ఒక సారి కన్ఫర్మ్ చేస్తే ఆ దరి దాపుల్లో కూడా ఏ ఒక్క చిన్న సినిమా రాదు.
పెద్ద సినిమాలు కూడా అవసరమా పోటీ అనుకుని తప్పుకున్న సందర్బాలు ఉన్నాయి.కాని ఈసారి పవన్ కళ్యాణ్ కు విడుదల తేదీ విషయంలో సరైన క్లారిటీ లేక కిందా మీద పడుతున్నాడు.
సంక్రాంతికి విడుదల చేయాలని డేట్ తో సహా అధికారికంగా ప్రకటించారు.కాని ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో భీమ్లా నాయక్ తప్పుకున్నాడు అన్నట్లుగా వార్తలు వచ్చాయి.
అన్నట్లుగానే ఇటీవల విడుదల చేసిన పాటలో మరియు పోస్టర్స్ లో విడుదల తేదీని తొలగించారు.అంటే సంక్రాంతి కి ఈ సినిమా లేదు అంటూ తేల్చి పారేశారు.
ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కొత్త సినిమా విడుదల తేదీని ప్రకటించలేదు.
![Telugu Bheemla Nayak, Pawanbheemla, Pawan Kalyan, Rrr-Movie Telugu Bheemla Nayak, Pawanbheemla, Pawan Kalyan, Rrr-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/11/bheemla-nayak-pawan-kalyan-rrr-movie.jpg )
సంక్రాంతి నుండి తప్పుకున్న సినిమాను రిపబ్లిక్ డే కు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.కాని రిపబ్లిక్ డే కు కూడా సంక్రాంతి సినిమాల సందడి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.రాధే శ్యామ్ మరయి బంగార్రాజు సినిమా లు బాక్సాఫీస్ వద్దకు భారీ ఎత్తున దూసుకు వస్తున్న ఈ సమయంలో రిపబ్లిక్ డే సందర్బంగా భీమ్లా నాయక్ సినిమాను విడుదల చేయడం సాధ్యం అయ్యే విషయం కాదు అంటున్నారు.
అందుకే ఫిబ్రవరి కి వెళ్లాలని అనుకుంటూ ఉండగా ఆచార్య సినిమా తో పాటు చాలా సినిమాలు కూడా విడుదల అవ్వడానికి సిద్దంగా ఉన్నాయి.కనుక ఆ నెలలో సినిమా విడుదల చేయడం సాధ్యం కాదు అని తేల్చి పారేశారు.
ఇక సమ్మర్ లో విడుదలకు సరైన సమయం వెదుక్కోవాలి.ఇప్పటికే సమ్మర్ మొత్తం చాలా సినిమాలతో ఫిల్ అయ్యింది.
కనుక పవన్ సినిమా కోసం డేట్ ను వెదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.పవన్ నటించిన ఏ సినిమాకు విడుదల విషయంలో ఇంతగా ఇబ్బంది కాలేదు.
అసలు సరైన సమయం లేకపోవడం వల్ల విడుదల విషయంలో క్లారిటీ ఇవ్వలేక పోతున్నారు.