షర్మిల పాదయాత్ర కు బ్రేకులు ! కోడ్ కారణమా ? జనాలు కారణమా ? 

వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా జనంలో పలుకుబడి పెంచుకుని సత్తా చాటుకోవాలని వైఎస్ షర్మిల భావిస్తున్నారు.దీనిలో భాగంగానే ఆమె తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తూ, జనాల్లో మైలేజ్ పెంచుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు.

 On The Praja Prasthanam Padayathra Ys Sharmila, Telangana, Jagan, Ysrtp, Kcr, Kt-TeluguStop.com

అయితే షర్మిల చేపడుతున్న పాదయాత్ర కు స్పందన అంతంత మాత్రంగానే వస్తుందని,  జనాలతో పాటు , రాజకీయ వర్గాల్లోనూ ఆమె పాదయాత్రపై పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు.ఈ నేపథ్యంలోనే షర్మిల పాదయాత్రకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు.

అయితే తాను పాదయాత్ర కు బ్రేక్ ఇవ్వడానికి కారణం ఎన్నికల కోడ్ అని , ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మళ్ళీ యాత్రను ప్రారంభిస్తామని షర్మిల చెబుతున్నారు.

         అయితే చేవెళ్ల నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చౌడంపల్లి కి చేరుకుంది.

ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల పాదయాత్ర చేపట్టడం వెనుక కారణాలు చాలా ఉన్నాయి . తెలంగాణలో ఆమె బలమైన నాయకురాలిగా ముద్ర వేయించుకునేందుకు, అధికార పార్టీ టిఆర్ఎస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా వైఎస్ ఆర్ టి పి ని తీర్చిదిద్దేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు.అయితే షర్మిల పాదయాత్రకు జనాల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో మీడియా సైతం పెద్దగా ఫోకస్ కల్పించక పోవడం, తదితర కారణాలతో ఆమె పాదయాత్రకు బ్రేక్ వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.మళ్లీ ఆమె డిసెంబర్ 15వ తేదీ తరువాత ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పాదయాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నా, షర్మిల వైఖరి చూస్తుంటే పాదయాత్ర ఇప్పట్లో చేపట్టే అవకాశం అంతంత మాత్రమే అన్నట్లుగా ఉంది.
   

Telugu Congress, Jagan, Prajaprasthanam, Telangana, Ys Sharmila, Ysrtp-Telugu Po

    ఇప్పటికే పార్టీలో పెద్దగా చేరికలు లేకపోవడం తదితర పరిణామాలు షర్మిల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.అలాగే మొదట్లో మీడియా ఫోకస్ ఎక్కువగా లభించినా తర్వాత బాగా తగ్గిపోవడం టిఆర్ఎస్ ను  టార్గెట్  చేసుకుని విమర్శలు చేస్తున్నా, జనాల్లో తమ పార్టీకి ఆదరణ పెరగకపోవడం ఇటువంటి పరిణామాలు షర్మిలకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube