నాచురల్ స్టార్ నాని హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో వస్తున్న సినిమా దసరా.తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ దసరా సందర్భంగా రిలీజ్ చేశారు.
నాని కెరియర్ లో మొదటిసారి తెలంగాణా యాసలో మాట్లాడుతూ నటిస్తున్న ఈ దసరా సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.ఆల్రెడీ నేను లోకల్ సినిమాలో నాని, కీర్తి సురేష్ ల జోడీ సూపర్ హిట్ కొట్టింది.
మళ్లీ ఈ సూపర్ హిట్ జోడీ కలిసి దసరా సినిమా చేస్తుంది.ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కు కూడా భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు టాక్.సినిమాలో నటిస్తున్నందుకు గాను కీర్తి సురేష్ కు ఏకంగా 3 కోట్ల దాకా పారితోషికం ఇస్తున్నారని టాక్.
మహానటి సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ వరుస స్టార్ సినిమాలతో సత్తా చాటుతుంది.అయితే తెలుగులో ఇప్పటివరకు 2 కోట్లు కూడా తీసుకోని కీర్తి సురేష్ నాని దసరా సినిమాకు మాత్రం 3 కోట్లు డిమాండ్ చేసిందట.
సినిమాలో ఆమె పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది.అందుకే కీర్తి సురేష్ అడిగినంత ఇస్తున్నట్టు తెలుస్తుంది.
మొత్తానికి సౌత్ లో 3 కోట్ల హీరోయిన్ లిస్ట్ లో కీర్తి సురేష్ కూడా చేరింది.