ఆహా హోసం బాలయ్య బాబు ఒక స్పెషల్ ప్రోగ్రాం చేస్తున్న విషయం తెలిసిందే.అన్ స్టాపబుల్ అంటూ రాబోతున్న ఈ షోలో బాలకృష్ణ హోస్టింగ్ టాలెంట్ చూడబోతున్నాం.
ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ షోలో మొదటి గెస్ట్ గా మొన్నటిదాకా రకరకాల పేర్లు వినపడ్డాయి.కాని బాలయ్య అన్ స్టాపబుల్ కి మొదటి గెస్ట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ వస్తున్నట్టు తెలుస్తుంది.
ఆహాలో సమంత హోస్ట్ గా చేసిన సామ్ జామ్ షోకి కూడా మొదటి గెస్ట్ గా విజయ్ దేవరకొండ వచ్చాడు.ఆ షో సక్సెస్ అయ్యింది.
ఇప్పుడు బాలయ్య అన్ స్టాపబుల్ షోకి కూడా విజయ్ దేవరకొండని గెస్ట్ గా పిలుస్తున్నారు.
ఆహాకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విజయ్ దేవరకొండ ఈ ఓటీటీలో ఎలాంటి షో మొదలైనా సరే మొదటి గెస్ట్ గా వస్తున్నాడు.
సీనియర్ హీరో బాలకృష్ణ షోకి విజయ్ దేవరకొండ గెస్ట్ గా రావడం అంటే సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు.మరి బాలయ్య బాబు అడిగే ప్రశ్నలకు విజయ్ ఎలా సమాధానం ఇస్తాడు.
అసలు ఈ అన్ స్టాపబుల్ షో కాన్సెప్ట్ ఏంటి.ఇది ఎలా సాగుతుంది అన్నది షో మొదలయ్యాక తెలుస్తుంది.
నవంబర్ 4 దీపావళి కానుకగా ఈ షో మొదలవుతుందని తెలుస్తుంది.