మీకు ఐ సైట్ ఉందా..? అయితే మీరీ పండ్లు తినాల్సిందే!

ఐ సైట్.చాలా మందిలో క‌నిపిస్తున్న కామ‌న్ స‌మ‌స్య ఇది.పూర్వం యాబై, అర‌వై ఏళ్లు దాటిని వారిలోనే ఐ సైట్ స‌మ‌స్య ఉండేది.కానీ, ప్ర‌స్తుత రోజుల్లో ప‌దేళ్ల పిల్ల‌ల్లో సైతం ఐ సైట్ క‌నిపిస్తోంది.

 Do You Know What Fruits Those Who Have An Eye Site Should Definitely Eat?! Fruit-TeluguStop.com

శ‌రీరంలో పోష‌కాల కొర‌త‌, ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, ఒత్తిడి, స్మార్మ్ ఫోన్ల‌ను అధికంగా ఉప‌యోగించ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఐ సైట్ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.కొంద‌రికి వంశ పారంపర్యంగా సంక్రమించే అవ‌కాశం కూడా ఉంటుంది.

అయితే కార‌ణం ఏదేమైన‌ప్ప‌టికీ ఐ సైట్‌తో బాధ ప‌డే వారు ఖ‌చ్చితంగా త‌మ డైట్‌లో కొన్ని పండ్ల‌ను చేర్చుకోవాల్సి ఉంటుంది.

ఆ పండ్లు ఏవీ…? వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే ఉప‌యోగాలు ఏంటీ.? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసు కుందాం.బొప్పాయి పండు చాలా టేస్టీగా ఉండ‌ట‌మే కాదు త‌క్కువ ధ‌రకే ల‌భిస్తుంది.

అయితే ఐ సైట్ ఉన్న వారు త‌ర‌చూ బొప్పాయి పండును తీసుకుంటే.అందులో ఉండే బీటా కెరోటీన్, విట‌మిన్ ఎ మ‌రియు యాంటీ ఆక్సిడెంట్స్ కంటి ఆరోగ్యాన్ని మెరుగు ప‌రిచి చూపును పెంచుతాయి.

అలాగే జామ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా జామ పండ్ల‌లో పుష్క‌లంగా ఉండే విట‌మిన్ ఎ ఐ సైట్ బాధితుల‌కు ఎంతో మేలు చేస్తుంది.ఈ పండ్లును డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల కంటి చూపు పెర‌గ‌డంతో పాటుగా కంటి దుర‌ద‌లు, పొడి బారం వంటి స‌మ‌స్య‌ల నుంచి సైతం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఐ సైట్ ఉన్న వారు సిట్ర‌స్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి.

నారింజ‌, బ‌త్తాయి, క‌మ‌లా వంటి పండ్ల‌ను త‌ర‌చూ తీసుకుంటే అందులో ఉండే విట‌మిన్ సి మ‌రియు శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తినే కాదు.కంటి  చూపును కూడా పెంచుతాయి.

అదే స‌మ‌యంలో ఇత‌ర కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube