ఇక కారు అన్ లాక్ చేసేందుకు ఫోన్ ఉంటే చాలు.. అందుబాటులోకి అదిరిపోయే టెక్నాలజీ..!

ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్లలో శాంసంగ్ అత్యద్భుతమైన ఫామ్ లో ఉంది.ఈ సంస్థ తమ వినియోగదారులకు ఓ శుభవార్తను చెప్పింది.

 Samsung Digital Key Technology To Lock Unlock Car From Mobile, Car Unlock, Lates-TeluguStop.com

స్మార్ట్ ఫోన్ సంస్థ అయిన శాంసంగ్ త్వరలోనే స్మార్ట్‌ఫోన్ల ద్వారా కారును లాక్, అన్ లాక్ చేసే విధానాన్ని తీసుకువస్తున్నట్లు తెలియజేసింది.డిజిటల్‌ ‘కీ’ సిస్టమ్‌ను ఇది రూపొందిస్తోంది.

అల్ట్రా వైడ్‌బ్యాండ్, నియర్‌ ఫీల్డ్‌ కమ్యునికేషన్ (ఎన్‌ఎఫ్‌సి) – ఎనేబుల్డ్ డిజిటల్ కార్ కీస్‌ ను శాంసంగ్ సంస్థ త్వరలోనే ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది.మొదటగా ఇటువంటీ డిజిటల్‌ ‘కీ’స్‌ విధానాన్ని దక్షిణ కొరియాలో ప్రవేశపెట్టనున్నారు.

ఎలక్ట్రిక్ జెనెసిస్ GV 60 కార్లకు శాంసంగ్‌ కీస్‌ రెడీ చేస్తోంది.గెలాక్సీ ఎస్ 21 లాంచ్ అయ్యేటప్పుడు తన స్మార్ట్ ఫోన్లలో డిజిటల్ కార్ కీస్‌ ను తీసుకురాబోతున్నట్లుగా శాంసంగ్ సంస్థ వెల్లడించింది.

ఇప్పుడు ఈ ఫీచర్‌ను కొన్ని శాంసంగ్‌ మోడళ్లలోకి తీసుకురావడానికి శాంసంగ్‌ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్, శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌ 21 అల్ట్రా, నోట్ 20 అల్ట్రా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2, ఫోల్డ్‌ 3 స్మార్ట్‌ఫోన్స్‌ యుడబ్ల్యుబి టెక్నాలజీతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్‌ వాహనాలను కీస్‌ లేకుండా ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ను వాడి నడపవచ్చు.

ఇటువంటి టెక్నాలజీ సాయంతో కార్‌ విండోస్‌ కూడా తెరవవచ్చు.అంతేకాదు.ఈ టెక్నాలజీతో కార్ విండోస్ ను మూసివేయవచ్చు.ఎంబెడెడ్ సెక్యూర్ ఎలిమెంట్ ద్వారా డిజిటల్‌ ‘కీ’స్‌ శాంసంగ్ సంస్థ పనిచేసేలా చేయనుంది.

Telugu Car Ret, Car Unlock, Car Keys, Genesis Gv Cars, Latest, Latest Ups, Lock

శాంసంగ్‌ కేవలం జెనెసిస్ జీవీ 60 కార్లకు మాత్రమే డిజిటల్‌ ‘కీ’స్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.ఆడి, BMW, ఫోర్డ్‌ వంటి పెద్ద పెద్ద ఆటో మొబైల్‌ కంపెనీలలో శాంసంగ్‌‌ కు షేర్లు ఉండటంతో ఈ పనిని చేయనుంది.డిజిటల్ టెక్నాలజీ రోజురోజుకూ పెరుగుతోన్న సమయంలో రానున్న రోజుల్లో ఆటోమొబైల్ కంపెనీలే టార్గెట్‌ గా శాంసంగ్ సంస్థ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube