మనకు సాధారణంగా ఏదైనా డైట్ వస్తే వెంటనే ఎవరిని అడుగుతాం.ఇంకేముంది మొబైల్ ఆన్ చేసి గూగుల్‌లో వెతికే్తాం కదా.
ఎందుకంటే గూగుల్ అయితే దేనికైనా కరెక్టుగా ఆన్సర్ చెప్పేస్తుందనే నమ్మకం.ప్రపంచ వ్యాప్తంగా అందరూ చేస్తున్న పని ఇదే.అయితే ఇప్పడు గూగుల్ కూడా ఓ విషయంలో కరెక్టుగా ఆన్సర్ చెప్పలేకపోతోంది.ఏంటి గూగుల్ కన్ఫ్యూజ్ అవడమా అనే కదా మీ డౌట్.
అవును మీరు విన్నది నిజమే.ఇప్పుడు మన ఏపీ ప్రభుత్వ పుణ్యమా అని గూగుల్ కూడా కరెక్టుగా జవాబు చెప్పలేకపోతోంది.
అదే నండి రాజధాని విషయంలో.
మీరు గూగుల్ లోకి వెళ్లి ఏపీ రాజధాని అని అడిగితే గనక మీకు నాలుగు రాజధానుల్ని చూపిస్తోంది మరి.
అదేంటి అనుకుంటున్నారా అదే మ్యాజిక్ మరి.అదేంటంటే జగన్ ప్రభుత్వం ఏపీకి మూడు రాజధానులు అని చెప్పింది కదా అందుకే గూగుల్ విశాఖపట్నం, కర్నూలుతో పాటుగా హైదరాబాద్ అలాగే అమరావతి పేర్లను కూడా తెరమీద చూపిస్తోంది.
మూడు రాజధానులు అని జగన్ ప్రభుత్వం చెప్తున్న వేళ ఇలా నాలుగు ప్లేస్ లను సెలెక్ట్ చేసి చూపిస్తోంది గూగుల్.ఇందులో అమరావతి పాతది.
![Telugu Amaravathi, Andra Pradesh, Ap, Google, Hyderabad-Latest News - Telugu Telugu Amaravathi, Andra Pradesh, Ap, Google, Hyderabad-Latest News - Telugu]( https://telugustop.com/wp-content/uploads/2021/10/Google-ap-capital-andra-pradesh-hyderabad.jpg)
కానీ కొత్తగా మూడు రాజధానులు అని జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది.కానీ ఇందుకు ఇప్టపి దాకా ఆమోద ముద్ర వేయకపోయినా గూగుల్ మాత్రం మూడు రాజధానులను చూపించింది.ఇకపోతే హైదరాబాద్ కూడా ఏపీకి పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతోంది కాబట్టి హైదరాబాద్ ను ఇందులో కలిపేసిందన్న మాట గూగుల్.ఇలా గూగుల్ కూడా ఏపీ రాజధాని అనే ప్రశ్నకు సరైన సమాధానం మాత్రం చెప్పట్లేదండోయ్.
ఇక వికీపీడియాలో కూడా మూడు రాజధానులు ఉన్న ఏకైక రాష్ట్రంగా ఏపీని చూపిస్తోంది మరి.