అక్కినేని నాగచైతన్య( Akkineni Naga Chaitanya ) హీరోగా నటించిన తాజా చిత్రం తండేల్.( Thandel ) తాజాగా విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ను సాధించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు.ఈ సక్సెస్ మీట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో నాగార్జున( Nagarjuna ) తన అభిమానులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.తమ విజయాలకు 2025 ముహూర్తం అని చెప్పడమే కాకుండా నాగచైతన్యతో వస్తున్నాము, కొడుతున్నాము అనిపించడం ఫ్యాన్స్ చప్పట్లతో హోరెత్తిపోయేలా చేసింది.
అయితే ఈ సంతోషాల సమయం కోసం అక్కినేని కుటుంబం చాలా రోజులుగా ఎదురుచూస్తోంది.

ఎందుకంటే గత కొంతకాలంగా అక్కినేని హీరోలలో( Akkineni Heroes ) ఎవరికీ సరైన హిట్టు పడడం లేదు.గత కొన్నేళ్లలో సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు, నా సామిరంగా తప్ప చెప్పుకోదగ్గ హిట్లు లేవు.లేనిపోని ప్రయోగాలు చేసి ఇంగ్లీష్ టైటిల్స్ తో డిజాస్టర్లు మూటగట్టుకున్నారు.
గత ఏడాది సంక్రాంతి తర్వాత ఏడాది గ్యాప్ వచ్చేసింది.ఈ సంవత్సరం ఒకటి కాదు ఏకంగా రెండు ప్యాన్ ఇండియా సినిమాల్లో భాగమయ్యారు.
కుబేర మెయిన్ హీరో ధనుష్ అయినప్పటికీ నాగార్జున ప్రాధాన్యం, పాత్రకున్న ప్రత్యేకత దీన్ని మల్టీస్టారర్ స్థాయికి తీసుకెళ్తున్నాయని ఇన్ సైడ్ టాక్.దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి ఊహించని సర్ప్రైజ్ ఉంటుందని అంటున్నారు.
రజనీకాంత్ కూలిలో సైతం విక్రమ్ రోలెక్స్ లాగా నాగ్ కు చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ ని లోకేష్ కనగరాజ్ డిజైన్ చేసినట్టుగా టాక్.

కాబట్టి ఈ రెండు కనక వర్కౌట్ అయితే నాగ్ కంబ్యాక్ మాములుగా ఉండబోవడం లేదని చెప్పాలి.ఆలస్యమవుతున్నా సరే కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నారు.ఇకపోతే అఖిల్( Akhil ) విషయానికి వస్తే ఏజెంట్ గాయం నుంచి కోలుకుని కొత్త చిత్రం మొదలు పెట్టేందుకు ఏడాదికి పైగానే పట్టింది.
ఇటీవలే లెనిన్ అనే సినిమాను మొదలు పెట్టారు.కంటెంట్ గురించి లీక్స్ ఆసక్తికరంగా ఉంటున్నాయి.రెగ్యులర్ జానర్ కాకుండా దర్శకుడు మురళికిషోర్ అబ్బూరు ఒక సరికొత్త బ్యాక్ డ్రాప్ తీసుకున్నారట.కుబేర, కూలి, లెనిన్ అన్నీ 2025 లోనే రిలీజవుతాయి.
చైతుకి తండేల్ బ్లాక్ బస్టర్ పడింది.విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందే మిస్టిక్ థ్రిల్లర్ కనక వేగంగా షూట్ జరుపుకుంటే ఈ సంవత్సరం రెండోసారి తన దర్శనం ఉంటుంది.
లేదంటే కాస్త లాంగ్ వెయిటింగ్ తప్పదు.మొత్తానికి నాగ్ చెప్పినట్టు 2025 నిజంగానే ముహూర్తమని చెప్పవచ్చు.
నాగార్జున, అఖిల్, నాగ చైతన్య ముగ్గురు ఎంచుకుంటున్న కాంబోలు వైవిధ్యంగా అనిపించడమే కాక ప్రేక్షకుల్లో అంచనాలు రేకెత్తించేలా కనిపిస్తున్నాయి.అయితే మొహమాటలకు పోకుండా, తొందరపడకుండా ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలు ఇచ్చేలా ఉన్నాయి.
మొత్తంగా చూసుకుంటే అక్కినేని హీరోలకు ముందు ముందు అదృష్టం కలిసి రాబోతున్నట్టు తెలుస్తోంది.వరుస విజయాలకు ముహూర్తం కుదిరినట్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.