అక్కినేని హీరో నాగచైతన్య(Akkineni Naga Chaitanya) హీరోగా నటించిన తాజా చిత్రం తండేల్.ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుము విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో మంచి విజయం సాధించడంతో ఈ సినిమా సక్సెస్ లో ఎంజాయ్ చేస్తున్నారు నాగచైతన్య.
తండేల్ సినిమా చైకి మంచి హిట్ ఇవ్వడంతో పాటు అక్కినేని అభిమానులకు ఫుల్ ఖుష్ ఇచ్చింది.చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా ప్రసారం అవుతూ దూసుకుపోతోంది.ఇకపోతే ఈ సినిమాలో చాలా సన్నివేశాలకు కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.తాజాగా జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమా కూడా ఒక ఆసక్తికర వీడియోని షేర్ చేసింది.ఫైమా షేర్ చేసిన వీడియోలో తండేల్ సినిమాకు వెళ్లడం, సినిమాలో లవ్ సీన్స్ ను ఎంజాయ్ చేయడంతో పాటు ఎమోషనల్ సీన్స్ లో కన్నీళ్లు పెట్టుకుంది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో పై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజెన్స్.

సినిమాకు ఫైమా గారు బాగా కనెక్ట్ అయ్యారు అందుకే ఎమోషనల్ అయ్యారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే నాగచైతన్య విషయానికి వస్తే.ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు నాగచైతన్య.చాలా గ్యాప్ తర్వాత నాగచైతన్య ఖాతాలో హిట్ సినిమా పడింది.ప్రస్తుతం ఒకవైపు మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాలు నటిస్తున్నారు.ఇక నెక్స్ట్ నాగచైతన్య ఎవరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు అన్న విషయంపై కూడా వార్తలు నడుస్తున్నాయి.
మరి నాగ చైతన్య నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తారో చూడాలి మరి.







