బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నాగచైతన్య.. అక్కినేని హీరో రాత మారుతోందిగా!

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య( Naga Chaitanya ) హీరోగా నటించిన చిత్రం తండేల్.( Thandel ) ఫిబ్రవరి 7న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.మంచి మంచి కలెక్షన్లను సాధిస్తూ ఈ సినిమా దూసుకుపోతోంది.దాంతో అక్కినేని అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.ఇదే జోష్ లో అదిరిపోయే లైనప్ తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు చైతన్య.తండేల్ సినిమా తర్వాత కార్తీక్ దండు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు.

 Boyapati Srinu To Direct Naga Chaitanya Details, Naga Chaitanya, Boyapati Srinu,-TeluguStop.com

అనంతరం స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో( Boyapati Srinu ) ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.పైగా ఇది చైతన్యకు 25వ సినిమా కావడం విశేషం.

ప్రస్తుతం బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో అఖండ-2 సినిమా చేస్తున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Telugu Akhanda, Boyapati Srinu, Geetha, Naga Chaitanya, Nagachaitanya, Thandel,

దీని తర్వాత చైతన్యతో బోయపాటి సినిమా చేసే అవకాశముందని సమాచారం.ఈ ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్( Geetha Arts ) బ్యానర్ లో రూపొందనుందట.కాగా ఇప్పటికే గీతా ఆర్ట్స్ లో చైతన్య రెండు సినిమాలు చేసిన విషయం తెలిసిందే.మొదటిది 100% లవ్, కాగా రెండవది ఇటీవల వచ్చిన తండేల్ సినిమా.

ఇప్పుడు బోయపాటి ప్రాజెక్ట్ ఓకే అయితే హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుందని చెప్పాలి.అయితే గీతా ఆర్ట్స్ లో బోయపాటి ఒక సినిమా కమిటై ఉన్నారు.

Telugu Akhanda, Boyapati Srinu, Geetha, Naga Chaitanya, Nagachaitanya, Thandel,

అల్లు అర్జున్ లేదా సూర్య వంటి స్టార్స్ తో ఆ సినిమా ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి.కానీ బోయపాటి అఖండ-2 సినిమాతో బిజీ కావడంతో ఆ తర్వాత దానికి సంబంధించిన న్యూస్ లేదు.ఇప్పుడు అనూహ్యంగా నాగ చైతన్య పేరు తెరపైకి వచ్చింది.దీంతో ఈ ప్రాజెక్టు పై రకరకాల ఊహాగా వినిపిస్తున్నాయి.గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి చేయబోయే సినిమా నాగచైతన్య తోనే ఉండబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వార్తలపై నాగచైతన్య బోయపాటి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube