ఇటీవల లండన్ ( London )నుంచి మాంచెస్టర్‌కు వెళ్తున్న రైలులో దారుణమైన జాత్యహంకార దాడి జరిగింది.26 ఏళ్ల ఎన్నారై మహిళ గాబ్రియెల్ ఫోర్సిత్‌పై ( Gabrielle Forsyth )ఓ తెల్లతోలు వెధవ విరుచుకుపడ్డాడు.ఆదివారం గాబ్రియెల్ ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.వలసదారులకు సహాయం చేసే స్వచ్ఛంద సంస్థలో తను చేస్తున్న పని గురించి తోటి ప్రయాణికుడితో గాబ్రియెల్ మాట్లాడుతోంది.
ఇంతలో పక్కనే కోచ్ లో బీరు తాగుతున్న ఓ వ్యక్తి ఆమె మాటలు విని ఒక్కసారిగా రెచ్చిపోయాడు.
దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్ అయింది.
ఆ వీడియోలో ఆ వ్యక్తి జాత్యహంకార, విద్వేషపూరిత వ్యాఖ్యలు స్పష్టంగా వినిపించాయి.గాబ్రియెల్‌ను గట్టిగా తిడుతూ, వలసదారులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు.అంతేకాదు ఇంగ్లండ్ గతంలో చేసిన విజయాల గురించి గొప్పలు చెప్పుకున్నాడు.“మీరు ఇంగ్లండ్‌లో ఉన్నారు, ఏదో క్లెయిమ్ చేస్తున్నారు.మీరు ఏదో క్లెయిమ్ చేయకపోతే మీరు ఇంగ్లండ్‌లో ఉండరు.ఇంగ్లీష్ వాళ్లు ప్రపంచాన్ని జయించి మీకు తిరిగి ఇచ్చేశారు.మేం ఇండియాను జయించాం, మాకు అది వద్దు, అందుకే మీకు తిరిగి ఇచ్చేశాం” అంటూ గట్టిగా అరిచాడు.

ఇంకా రెచ్చిపోతూ ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని హేళన చేస్తూ, “అలాంటి దేశాలు చాలా ఉన్నాయి.మీ సార్వభౌమాధికారం గురించో లేక మరేదో దాని గురించో నాకు చింత లేదు.నన్ను రికార్డ్ చేయండి, ఎందుకంటే నేను మిమ్మల్ని రికార్డ్ చేస్తున్నా.” అని అన్నాడు.మరింత దిగ్భ్రాంతికరంగా “నేను నిన్ను కొట్టను, అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆమె దెబ్బలు తినడానికి బతుకుతుంది.కానీ నేను ఆమెను ఇప్పుడు దెబ్బలు కొట్టను.” అని అసభ్యంగా మాట్లాడాడు.ఈ దాడి గురించి గాబ్రియెల్ తరువాత మాట్లాడుతూ “షాకింగ్‌గా ఉంది” అని చెప్పింది.“వలసదారుడు” అనే పదం వినగానే ఆ వ్యక్తి అంత కోపంగా రియాక్ట్ అవ్వడం చాలా భయానకంగా అనిపించిందని తెలిపింది.“అది ఒక పిచ్చి పరిస్థితి.నన్ను నేను రక్షించుకోవడానికి వీడియో తీసుకున్నా.
మేం కనిపించే విధంగా తెల్లగా లేం” అని ఆమె పేర్కొంది.

వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన తరువాత ఆమెకు విపరీతమైన ద్వేషపూరిత మెసేజ్‌లు వచ్చాయి.“ఈ ఒక్క వీడియో వల్ల నేను అందుకున్న దూషణలు చాలా ఎక్కువ.నాకు అసలు తెలియని తిట్లన్నీ నన్ను తిట్టారు.
హింసాత్మక మాటలు, విద్వేషపూరిత ప్రసంగాలు X (ట్విట్టర్)లో చాలా సులభంగా వ్యాప్తి చెందుతున్నాయి” అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.గాబ్రియెల్ ఈ ఘటనపై బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీసులకు( British Transport Police ) (BTP) ఫిర్యాదు చేసింది.ఇంత వేధింపులు ఎదురైనా, ఆమె తను భారతీయురాల్ని అని గర్వంగా చెప్పుకుంటుంది.“నేను భారతీయురాలిని, వలసదారుల కుమార్తెను కావడం, నా సంస్కృతితో సంబంధం కలిగి ఉండటం ఒక వరం.నేను ఎల్లప్పుడూ నా కోసం, నాలాంటి నల్ల జాతీయుల కోసం నిలబడతాను.” అని ఆమె ధైర్యంగా ప్రకటించింది.







