టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనందరికీ తెలిసిందే.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
అలాగే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో కూడా పడ్డారు.సినిమాలకంటే రాజకీయాలపై ఎక్కువగా ఫొటోస్ పెట్టారు పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.అందులో కొన్ని సినిమాలు ఇప్పటికే కొంతమేర షూటింగ్ ని కూడా జరుపుకున్నాయి.
అయితే మొన్నటి వరకు ఆ సినిమాలను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ కి టైం లేదని అందరూ అనుకున్నారు.

కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ కి టైం కాదు ఆయనకు సినిమాల పట్ల ఇంట్రెస్ట్ లేదు అని అనిపిస్తోంది.ఎందుకో హరిహర వీరమల్లు,( Hari Hara Veeramallu ) ఓజీ( OG ) సినిమాలు పూర్తిచేయడానికి పవన్ ఇంట్రెస్ట్ చూపించడం లేదనిపిస్తోంది.నిజంగా రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే అర్థం చేసుకోవచ్చు.
వాటిని తప్పించి, సినిమా సెట్స్ పైకి రావడం కాస్త కష్టమైన వ్యవహారమే.కానీ ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రస్తుతం లేవు.
కేవలం ఆలయాల పర్యటన పెట్టుకున్నారు అంతే.మొన్నటికి మొన్న పవన్ పై నమ్మకంతో హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ పెట్టుకున్నారు.
షూటింగ్ ఇలా మొదలైందో లేదో పవన్ కు జ్వరం వచ్చింది.స్పాండిలైటిస్ కూడా ఉందంటూ పార్టీ నుంచి ప్రకటన వచ్చింది.

ఆ జ్వరం నుంచి కోరుకున్న తర్వాత అయినా సినిమా మొదలు పెడతారు అనుకుంటే సనాతన ధర్మ పరిరక్షణ పేరిట దక్షిణాదిన ఉన్న కొన్ని ఆలయాన్ని సందర్శించాలని ఫిక్స్ అయ్యారు పవన్ కల్యాణ్.ఇంతకుముందు ఈ షెడ్యూల్ వినిపించలేదు.ఉన్నఫలంగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఒక 2 వారాలు సినిమాలు పూర్తిచేసి, అప్పుడు ఆలయాల సందర్శన పెట్టుకుంటే సరిపోయేది.ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు.గతంలో కూడా సరిగ్గా షూటింగ్ ఉన్న టైమ్ లో ఆరోగ్యం బాగాలేకపోవడం, ఆకస్మిక కార్యక్రమాలు షెడ్యూల్ అవ్వడం లాంటివి జరిగాయి.
దీంతో ఈ విషయం పట్ల అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.