టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఐశ్వర్యా రాజేష్ ( Aishwarya Rajesh )పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే.సంక్రాంతికి వస్తున్నాం( Sankrantiki vastunnam ) సినిమాతో ఐశ్వర్యా రాజేష్ ఖాతాలో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చేరింది.
ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ మా అమ్మే నాకు స్పూర్తి అని ఆమె చెప్పుకొచ్చారు.మా తల్లీదండ్రులకు మేము నలుగురు సంతానం అని చిన్నతనంలోనే నా తండ్రి చనిపోయారని ఆమె కామెంట్లు చేశారు.
అమ్మ ఒక్కరే ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచిందని ఆమె పేర్కొన్నారు.ఈ ప్రయాణంలో అమ్మ మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని ఐశ్వర్యా రాజేష్ వెల్లడించారు.అమ్మకు అండగా నిలబడాలనే ఆలోచనతో చిన్న వయస్సులోనే పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేశానని ఆమె అన్నారు.ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టానని నాకు నచ్చిన సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నానని ఆమె వెల్లడించారు.

లవ్ కంటే కూడా బ్రేకప్ సమయంలో బాధ ఎక్కువగా ఉంటుందని ఐశ్వర్యా రాజేష్ అన్నారు.బాధ అంటే నాకు ఎంతో భయం అని ఐశ్వర్యా రాజేష్ తెలిపారు.నేను చాలా ఎమోషనల్ అని ప్రేమించిన సమయం కంటే అది మిగిల్చిన బాధ నుంచి బయటకు రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు.గతంలో నేను రిలేషన్ లో ఉన్నానని ఐశ్వర్యా రాజేష్ వెల్లడించారు.

సినిమాల్లోకి అడుగుపెట్టిన కొత్తలో ఒక వ్యక్తిని ఇష్టపడ్డానని ఐశ్వర్యా రాజేష్ పేర్కొన్నారు.అతని నుంచి వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు.దానికంటే ముందు కూడా అలాంటి ప్రేమనే చూశానని ఐశ్వర్యా రాజేష్ వెల్లడించారు.రిలేషన్ షిప్ లో ఎందుకు ఇలా జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నానని ఆమె కామెంట్లు చేశారు.ఐశ్వర్యా రాజేష్ రెమ్యునరేషన్ సైతం కొంతమేర పెరిగిందని సమాచారం అందుతోంది.
టాలీవుడ్ లో ఐశ్వర్యా రాజేష్ కు కొత్త ఆఫర్లు వస్తాయేమో చుడాల్సి ఉంది.







