క్యారెట్ అనే మాట విన్నాక కళ్ల ముందు నారింజ వర్ణంలో మెరిసిపోయే కాయలు కనిపిస్తాయి.ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు.
క్యారెట్‌లో కెరోటినాయిడ్స్ ఉండటంతో శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.చర్మానికి అందాన్ని ఇస్తుంది.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.సమతౌల్య ఆహారం తీసుకోవాలనుకునే వారు క్యారెట్‌ని తప్పనిసరిగా తమ ఆహారంలో భాగం చేసుకుంటారు.
అయితే మార్కెట్లో ప్రస్తుతం కొన్ని క్యారెట్లపై( carrot) కృత్రిమ రంగులు(Artificial colors) వాడుతున్నారని తెలిసి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్యారెట్‌కు</em( carrot) విపరీతమైన డిమాండ్ ఉండడంతో కొంతమంది వ్యాపారులు క్యాష్ చేసుకోవడానికి పచ్చికాయలపై కృత్రిమ రంగులు(Artificial colors) స్ప్రే చేస్తున్నారు.
ఈ కాయలు సహజసిద్ధంగా పండేవరకు ఎదురుచూడకుండా, ముందుగానే తెంపి పై పొరను తొలగించి, కృత్రిమ రంగులు చిలకరించి క్యారెట్‌ను ఆకర్షణీయంగా మార్చుతున్నారు.కృత్రిమంగా రంగులు వేస్తున్న దృశ్యాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ వీడియో ఏకంగా 10 మిలియన్లకు పైగా వ్యూస్, లక్షల సంఖ్యలో కామెంట్స్ సాధించింది.దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.

ఇది చుసిన నెటిజన్స్.ఓరి దేవుడా ఇంత గుడ్డిగా మోసపోతున్నామా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు ఇకపోతే, కృత్రిమ రంగులు కలిపిన క్యారెట్ తినడం వల్ల ఆహార విషపూరిత సమస్యలు, అలర్జీ, కాలేయ సమస్యలు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అందువల్ల క్యారెట్ కొనేముందు చేతితో తాకి, రంగులు వాడారా లేదా అని పరీక్షించడం అవసరమని నెటిజన్లు సూచిస్తున్నారు.
ఇలాంటి మోసాలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇలాగే జరుగుతోందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మార్కెట్లో మెరిసిపోయే క్యారెట్ చూసి ఆకర్షితులవడం సాధారణమే.కానీ ఆరోగ్యం విషయంలో ఎన్నిసార్లైనా ఆలోచించి, సహజసిద్ధమైన క్యారెట్‌ను మాత్రమే కొనడం అవసరం.అందుకే కృత్రిమంగా రంగులు కలిపిన కాయలను తినకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.







