ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కష్టపడి చదివించాడు, ఉద్యోగం కోసం అప్పులు కూడా చేశాడు.కానీ చివరకు ఆ భార్యే అతడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
రైల్వే జాబ్ రాగానే మొగుడ్ని వదిలేసి, “నువ్వేం పీకుతావ్” అంటూ అవమానించింది.దీంతో ఆ భర్త పగతో రగిలిపోయాడు.
తన భార్య చేసిన మోసాన్ని బయటపెట్టి జైలుకు పంపించాడు.ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్‌లోని కరౌలిలో జరిగింది.
మనీష్ మీనా( Manish Meena ) అనే వ్యక్తి రోనాసి గ్రామానికి చెందినవాడు.2022 జనవరి 22న సప్నా మీనాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.సప్నా స్వస్థలం సవాయి మాధోపూర్‌లోని టిగ్రియా గ్రామం.పెళ్లైన కొత్తలో బాగానే ఉన్నారు కానీ, సప్నాకి గవర్నమెంట్ జాబ్ కావాలని కోరిక పుట్టింది.దీంతో మనీష్ తన భార్య కలను నెరవేర్చడానికి నడుం బిగించాడు.సప్నాని బాగా చదివించాడు.
కోచింగ్ కోసం అప్పు కూడా చేశాడు.కోటాలోని ఓ కోచింగ్ సెంటర్‌లో చేర్పించాడు.

రైల్వే జాబ్ ( Railway Job )కోసం సప్నా అప్లై చేసింది.అయితే సప్నా వాళ్ల బాబాయి చెతన్‌రామ్ అడ్డదారిలో జాబ్ సంపాదించొచ్చని చెప్పాడు.ఏకంగా రూ.15 లక్షలు ఇస్తే, రైల్వే జాబ్ కొట్టొచ్చని నమ్మబలికాడు.దీంతో మనీష్ తనకున్న భూమిని తాకట్టు పెట్టి రూ.15 లక్షలు తెచ్చాడు.ఆ డబ్బుని చెతన్‌రామ్‌కి, రైల్వే గార్డ్ రాజేంద్రకి ఇచ్చాడు.ప్లాన్ ప్రకారం, లక్ష్మీ మీనా అనే డమ్మీ క్యాండిడేట్‌ని పెట్టి సప్నా బదులు రాత పరీక్ష రాయించారు.
ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి మరీ ఈ ఘనకార్యం చేశారు.దీంతో సప్నాకి కోటాలోని సోగారియా రైల్వే స్టేషన్‌లో పాయింట్స్‌మెన్‌గా జాబ్ వచ్చింది.

ఇంత జరిగాక అసలు కథ మొదలైంది.జాబ్ వచ్చిన ఆరు నెలలకే సప్నా అసలు రూపం బయటపెట్టింది.మొగుడు ఉద్యోగం లేనోడు అని చెప్పి మనీష్‌ని వదిలేసింది.దీంతో మనీష్ షాకయ్యాడు.గుండె పగిలినంత పనైంది.అంతేకాదు, టెక్నీషియన్ జాబ్ కోసం ఇంకో రూ.9 లక్షలు ఇస్తే పని అవుతుందని చెతన్‌రామ్ మనీష్‌ని నమ్మించి మోసం చేశాడు.దీంతో మనీష్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు.
మోసపోయానని తెలుసుకుని రగిలిపోయాడు.వెంటనే రైల్వే విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌కి, సీబీఐకి కంప్లైంట్ చేశాడు.
సీబీఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది.కరౌలి, కోటా, ఇతర ప్రాంతాల్లో రైడ్స్ చేశారు.
డమ్మీ క్యాండిడేట్‌తో పరీక్ష రాయించినట్టు ఆధారాలు దొరికాయి.సప్నా, లక్ష్మీ మీనా ఫేక్ ఫోటోలు, ఐడీ ప్రూఫ్‌లు వాడినట్టు సీబీఐ తేల్చింది.
దీంతో సప్నాని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.సప్నా, డమ్మీ క్యాండిడేట్ లక్ష్మీ మీనాపై లీగల్ యాక్షన్ తీసుకున్నారు.
ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.