చెన్నై నుంచి ట్యూటికోరిన్‌కు( Chennai to Tuticorin ) వెళ్తున్న విమానంలో ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.విల్సన్ మధురం అనే వ్యక్తి జనవరి 2025, 27న విమానం గాల్లో ఉండగా ఉన్నట్టుండి లేచి నిలబడ్డాడు.
ఆ వెంటనే ప్రయాణికులందరికీ బైబిల్ ప్రవచనాలు( Bible prophecies ) చెప్పడం మొదలుపెట్టాడు.ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు.

తూత్తుకుడికి చెందిన విల్సన్ మధురం మొదట అందరికీ నమస్కారం చేసి, ఏకంగా జీసస్ క్రైస్ట్ దీవెనలు( Blessings of Jesus Christ ) కూడా ఇచ్చేశాడు.ఆ తర్వాత బైబిల్ లోని ఒక వాక్యాన్ని వల్లె వేశాడు.“దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి, ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు.ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరూ శాశ్వత జీవితాన్ని పొందుతారు.” అని చెప్పాడు.దేవుడు అందరినీ ప్రేమిస్తాడు కాబట్టే యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడని చెప్పడమే కాకుండా పైలట్, ప్రయాణికులు, విమానం.
ఇలా అందరూ క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థించాడు.చివరగా అందరికీ హ్యాపీ జర్నీ చెప్పి తన ప్రవచనాన్ని ముగించాడు.

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.విల్సన్ ఇంత హడావిడి చేస్తున్నా విమానంలో ఒక్క ప్రయాణికుడు గానీ, ఎయిర్‌లైన్స్ సిబ్బంది గానీ అతన్ని ఆపడానికి ప్రయత్నించలేదు.దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా దుమారం రేగింది.తమిళనాడు( Tamil Nadu ) లాంటి సెన్సిటివ్ స్టేట్‌లో ఇలాంటి ఘటనలు జరగడం కరెక్టేనా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
కొందరైతే ఇది మత ప్రచారం అని, తప్పించుకోలేని చోట ఇలాంటివి చేయడం సరికాదని విమర్శిస్తున్నారు.వేరే మతాల వాళ్లు ఇలా చేసి ఉంటే ఊరుకునేవారా అని మరికొందరు నిలదీస్తున్నారు.
మొత్తానికి ఈ వీడియో పుణ్యమా అని మత స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజా స్థలాలు లాంటి అంశాలపై మళ్లీ చర్చ మొదలైంది.కొందరు విల్సన్ చేసింది పెద్ద తప్పేం కాదని కొట్టిపారేస్తుంటే, మరికొందరు మాత్రం ఇది పబ్లిక్‌గా వేధించడమే అని ఫైర్ అవుతున్నారు.
ఏం జరుగుతుందో చూడాలి.







