మొగుడు వద్దు.. బ్యాంక్ ఉద్యోగే ముద్దు.. అప్పులు కట్టించడానికి వచ్చినోడితోనే ఇల్లాలు జంప్..

బిహార్‌లోని జమూయి( Jamui in Bihar ) అనే పట్టణంలో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది.ఓ ఇల్లాలు తన భర్తను కాదని, బ్యాంకు ఉద్యోగితో లేచిపోయింది.

 Illalu Jumps When The Bank Employee Comes To Settle Debts, Bihar Love Affair, Vi-TeluguStop.com

అంతేకాదు, అతన్నే పెళ్లి కూడా చేసుకుంది.ఈ షాకింగ్ ఘటన బిహార్‌లోని జమూయిలో జరిగింది.

త్రిపురారి ఘాట్ దగ్గర ఉన్న భూత్‌నాథ్ టెంపుల్‌లో ఈ పెళ్లి తంతు జరిగింది.ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందిరా కుమారి( Indira Kumari ) అనే మహిళ సొనో పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మ టాండ్ గ్రామానికి చెందినది.ఆమెకు పెళ్లయి ఏడాదిన్నర అయింది.

కానీ ఆమె తన భర్త చేతిలో చాలా హింసను అనుభవించిందట.రోజూ మద్యం తాగి వచ్చి ఆమెను వేధించేవాడని సమాచారం.

ఈ వేధింపులు భరించలేక విసిగిపోయిన ఇందిరాకు, పవన్ కుమార్ అనే బ్యాంకు ఉద్యోగి పరిచయం అయ్యాడు.పవన్ లచువాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జజాల్ గ్రామానికి( Jajal village ) చెందినవాడు.

పవన్ చకైలోని ఒక బ్యాంకులో పనిచేస్తున్నాడు.లోన్ రికవరీ కోసం అతను ఊరూరా తిరుగుతూ ఉండేవాడు.అలా కొన్ని నెలల కిందట ఇందిరాను కలిశాడు.ఆమె నుంచి లోన్ రికవరీ చేయడానికి తరచుగా వస్తుండేవాడు అయితే ఆ క్రమంలో వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.అలా వారి మధ్య బంధం బలపడింది.

దీంతో ఇందిరా తన భర్తను వదిలి పవన్‌తో వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.

మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భూత్‌నాథ్ టెంపుల్‌లో ( Bhutnath Temple )హిందూ సంప్రదాయ పద్ధతిలో ఇందిరా, పవన్ పెళ్లి చేసుకున్నారు.వారి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ జంట ప్రేమ వ్యవహారం, పెళ్లి గురించి తెలుసుకుని చాలా మంది స్థానికులు గుమిగూడారు.

ఈ ఘటన ఇప్పుడు ఊర్లో హాట్ టాపిక్‌గా మారింది.కొందరు ఇందిరా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.

భర్త వేధింపులు భరించలేకే ఆమె ఇలా చేసిందని అంటున్నారు.మరికొందరు మాత్రం ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు.

మొత్తానికి ఈ ప్రేమ పెళ్లి మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube