ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ విచారణకు హాజరుకానున్నారు.
అయితే మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ తొలిసారి సీబీఐ విచారణకు హాజరవుతున్నారు.ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ సీబీఐ విచారణకు సహకరిస్తానన్నారు.
తప్పు చేయనప్పుడు దాచడానికి ఏమీ లేదన్న ఆయన బీజేపీ ఎవరినైనా జైలులో పెట్టగలదని ఆరోపించారు.బీజేపీ ఆదేశిస్తే సీబీఐ ఎవరినైనా అరెస్ట్ చేస్తుందని విమర్శించారు.
తప్పు చేయకపోయినా అరెస్ట్ చేస్తారన్నారు.అధికారం ఉందన్న అహంకారంతో బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రాజకీయాల కోసం తప్ప బీజేపీ ప్రభుత్వం చేసేందేమి లేదని విమర్శించారు.







