టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సమంత( Samantha ) ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటూ కేవలం వెబ్ సిరీస్ లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పాలి.ఇక ఈమె తెలుగులో చివరిగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా తర్వాత సమంత తెలుగు తెరపై కనిపించలేదు.దీంతో ఈమె సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇక సమంత ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా ఈమె వెండితెరపై సందడి చేస్తూ ప్రేక్షకులను మెప్పించ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.
ఇక సమంత సోషల్ మీడియా వేదికగా ఏ చిన్న పోస్ట్ చేసిన అధిక్షణాలలో వైరల్ అవుతుంది.సమంత నాగచైతన్య ( Nagachaitanya ) విడాకులు( Divorce ) తీసుకున్నప్పటినుంచి ఈమె ఎలాంటి పోస్ట్ చేసిన ఆ పోస్ట్ నాగచైతన్యను ఉద్దేశించి చేశారు అంటూ నేటిజన్స్ సైతం ఆ పోస్టును మరింత వైరల్ చేస్తున్నారు.
అయితే ఇటీవల నాగచైతన్య సమంతతో విడాకుల గురించి పలు విషయాలను వెల్లడించారు.

సమంతతో విడిపోవాలని నేను తీసుకున్న నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకున్నది కాదు 1000 సార్లు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాను.ఇక ఈ విషయాన్ని మేము ఎంతో గౌరవంగా బయట పెడుతూ మాకు ప్రైవసీ కావాలని చెప్పినప్పటికీ కొంతమంది మాత్రం ఎంటర్టైన్మెంట్ లాగా భావించారు అంటూ విడాకుల గురించి మాట్లాడారు.అయితే తాజాగా సమంత చేసిన ఒక పోస్ట్ మాత్రం నాగచైతన్యను ఉద్దేశించి చేశారు అంటూ ఫ్యాన్స్ ఈ పోస్టును వైరల్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ పోస్ట్ షేర్ చేస్తూ…మనిషిగా మీరు ఒక స్థిరమైన జీవి కాదు.ఏదీ స్థిరంగా ఉండదు – మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండవచ్చు అంటూ ఒక కొటేషన్ షేర్ చేశారు.అయితే ఈ పోస్ట్ మాత్రం తప్పనిసరిగా చైతన్యను ఉద్దేశించి చేశారు అంటూ అభిమానులు భావిస్తున్నారు.







