మొబైల్ ఫోన్ల వినియోగం రోజురోజుకూ విపరీతంగా పెరుగుతుండటంతో పాటు, అతి వినియోగం వల్ల ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి.ముఖ్యంగా బ్యాటరీ వేడెక్కి ఫోన్లు పేలడం వంటి ఘటనలు సాధారణమవుతున్నాయి.
ఇటీవల బ్రెజిల్( Brazil ) దేశంలో ఊహించని ఘటన ఒకటి చోటుచేసుకుంది.ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బ్రెజిల్‌లో ఓ మహిళ సూపర్ మార్కెట్‌కు భర్తతో కలిసి షాపింగ్‌కి వెళ్లింది.ఆమె వస్తువులు కొనుగోలు చేస్తుండగా, బ్యాక్ ప్యాకెట్‌లో( Back Pocket ) ఉంచిన మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలింది.
ఈ ఘటనను గమనించిన అక్కడ ఉన్న వారు మొత్తానికి ఆమెను ప్రాణాపాయం తప్పించారు.
మొబైల్ ఫోన్ పేలుడుతో( Mobile Phone Explosion ) ఆ యువతి వెనుక భాగం, చేతులకు గాయాలు అయ్యాయి.ఈ సంఘటన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్( Viral Video ) అవుతోంది.
స్మార్ట్‌ఫోన్ వినియోగంలో కొన్ని అప్రమత్తతలు పాటించకపోతే బ్యాటరీ అత్యధికంగా వేడెక్కడం, ఫోన్ పేలడం వంటి ఘటనలు జరగవచ్చు.అధిక ఉష్ణోగ్రతలో ఫోన్ వినియోగం, లోకల్ ఛార్జింగ్ కేబుల్‌లు ఉపయోగించడం, ఓవర్‌చార్జింగ్, పాడైన బ్యాటరీని మార్చకపోవడం, ఎలా జాగ్రత్తపడాలి? ఇలా అనేక అంశాలపై జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యంగా అధిక వేడి ఉన్నప్పుడు మొబైల్ వినియోగం తగ్గించాలి.అసలు కంపెనీ ఛార్జర్‌లను మాత్రమే ఉపయోగించాలి.
ఫోన్ బ్యాటరీ వేడి అవుతున్నట్లయితే వెంటనే ఆఫ్ చేసి, చల్లబడేలా చూడాలి.పాడైన బ్యాటరీలు వెంటనే మార్చుకోవాలి.
సోషల్ మీడియాలో ఈ సంఘటనపై నెటిజన్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఆమెకు ఎలా ఉందని కొందరు కామెంట్ చేస్తుండగా.మరికొందరు మొబైల్ వినియోగంపై మరింత జాగ్రత్తలు పాటించాలని సూచించారు.స్మార్ట్‌ఫోన్ ప్రమాదాలు తగ్గాలంటే సురక్షిత చిట్కాలను పాటించడం అవసరమని చాలామంది సూచిస్తున్నారు.స్మార్ట్‌ఫోన్ ఉపయోగం తప్పనిసరి అయినప్పటికీ, జాగ్రత్తలతో ఉంటే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు.