మొటిమలు మచ్చలు( Blemishes ) లేకుండా తమ ముఖ చర్మం అద్దంలా మెరిసిపోతూ కనిపించాలని చాలా మంది కోరుకుంటారు.అటువంటి చర్మాన్ని పొందడం కోసం రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు.
అయితే మార్కెట్ లో లభ్యమయ్యే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మాత్రం మీ ముఖ చర్మాన్ని అందంగా, కాంతివంతంగా మెరిపిస్తుంది.
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు బీట్ రూట్ స్లైసెస్,( Beetroot Slices ) నాలుగు క్యారెట్ స్లైసెస్,( Carrot Slices ) కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి, వన్ టీ స్పూన్ తేనె మరియు వన్ టీ స్పూన్ పచ్చి పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ రెమెడీని పాటించడం వల్ల చాలా చర్మ ప్రయోజనాలను పొందుతారు.బీట్ రూట్, క్యారెట్ లోని పలు గుణాలు మరియు పోషకాలు మొటిమలకు అడ్డుకట్ట వేస్తాయి.
మచ్చలను నివారిస్తాయి.అలాగే బీట్ రూట్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కాంతిని పెంచుతాయి.
క్యారెట్‌లోని విటమిన్ ఎ మరియు విటమిన్ సి చర్మం నిగనిగలాడేలా చేస్తుంది.

క్యారెట్‌లోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం యవ్వనంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.బీట్ రూట్ ఫైన్ లైన్స్, ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది.ముల్తానీ మట్టి( Multhani Mitti ) చర్మం మీద ఉన్న మురికి, ఆయిల్, మేకప్ అవశేషాలను తొలగిస్తుంది.
చర్మాన్ని రిఫ్రెష్ చేసి, కాంతివంతంగా మార్చుతుంది.పాలు డ్రై స్కిన్‌కి మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి.
ఇక తేనెలోని యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు మొటిమల కారణమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది.