తమిళ నటి వనితా విజయ్ కుమార్( Tamil actress Vanitha Vijay Kumar ) గురించి మనందరికీ తెలిసిందే.అప్పుడెప్పుడో వచ్చిన చంద్రలేక సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈమె చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.
పలు సీరియల్స్ లో కూడా నటించింది.అలాగే బుల్లితెరపై కూడా పలు షోలలో సందడి చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వనితా విజయ్ కుమార్.
కాంట్రవర్సీ విషయాల్లో కూడా ఈమె బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.ఇకపోతే ప్రస్తుతం వనిత విజయ్ కుమార్ ఒక సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
అయితే తెలుగులో మళ్లీ పెళ్లి చిత్రంలో నటించిన వనితా ఈ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్(Movie promotions) తో బిజీగా ఉన్నారు.కాగా అయితే వనితా విజయ కుమార్, కొరియోగ్రాఫర్(Vanitha Vijaya Kumar, Choreographer) రాబర్ట్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గత ఏడాది అక్టోబర్ లో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.బీచ్ లో అతనికి ప్రపోజ్ చేస్తున్నట్లు ఫోటోలు షేర్ చేయడంతో అందరూ కూడా నాలుగో పెళ్లికి సిద్ధమైపోయిందని భావించారు.
కానీ ఆ తర్వాత మూవీ ప్రమోషన్స్ కోసమే పోస్టర్ రిలీజ్ చేశారని తెలిసింది.తాజాగా తన మూవీ ప్రమోషన్లలో భాగంగా మరో పోస్టర్ ను విడుదల చేసింది.
మిసెస్ అండ్ మిస్టర్ సినిమా పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకుంది.

పెళ్లి చేసుకోవాలనే ఆశతో ప్రేమలో పడ్డాం.కలకాలం కలిసి జీవించాలనే ఆశతో పెళ్లి చేసుకున్నాం.అరుణ్, విద్యాల ప్రపంచంలో ఏం జరిగింది? అంటూ లవ్ కోటేషన్ కూడా రాసుకొచ్చింది.ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.ఈ పోస్టర్ చూసిన కొందరు మళ్లీ పెళ్లి చేసుకోబోతుందా అంటూ పోస్టులు పెడుతున్నారు.అయితే ఇదంతా సినిమా ప్రమోషన్లలో భాగంగానే చేసినప్పటికీ పెళ్లికి సంబంధించిన పోస్టర్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది.ఇలా ఇప్పటికే చాలాసార్లు తన నాలుగో పెళ్లి ప్రస్తావన వచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ పోస్టర్ తో మరోసారి ఈమె నాలుగో పెళ్లి గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.