మలయాళ నటుడు క్రిస్ వేణుగోపాల్(Chris Venugopal).గత కొద్ది రోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఈయన నటీ దివ్య శ్రీధర్(Actress Divya Sridhar) ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.దీంతో వీరి పెళ్లి పై భారీగా విమర్శలు వచ్చాయి.
మనవడు మనవరాళ్లతో ఆడుకునే వయసులో పెళ్లి చేసుకోవడం అవసరమా? అంటూ ఒక రేంజ్ లో విమర్శలు వచ్చాయి.దివ్య శ్రీధర్(Divya Sridhar) పై కూడా ట్రోల్ల్స్ చేస్తూ ఆస్తి కోసమే అతని పెళ్లి చేసుకుంది అంటూ కూడా కామెంట్స్ చేశారు.
ఆ విమర్శలను తిప్పికొడుతూ ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించారు.గత ఏడాది నవంబర్ లో వేదమంత్రాల సాక్షిగా ఇద్దరు ఒక్కటయ్యారు.

మొన్నటి దాకా ముసలాడికి పెళ్లేంటన్న జనాలు ఇప్పుడు ఇద్దరూ విడిపోయారంటూ ప్రచారం మొదలు పెట్టారు.తాజాగా ఈ రూమర్లపై దివ్య శ్రీధర్ స్పందించింది.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది.మేము ఎవరి జీవితాల్లోకి తొంగి చూడట్లేదు.ఎవరికీ ఏ హానీ తల పెట్టలేదు.మరెందుకు మా జీవితాల గురించి ఇష్టారీతిన రాస్తున్నారు.
ఎవరికి నచ్చినట్లు వారు ఏవేవో కథలు అల్లేసుకుంటున్నారు.మా జంట మీకు నచ్చకపోతే మమ్మల్ని వదిలేయండి.
చెత్త కామెంట్లు మాత్రం పెట్టకండి.మమ్మల్ని ప్రేమిస్తున్నవారందరికీ థాంక్యూ.
ఇప్పుడీ వీడియో చేయడానికి ప్రధాన కారణం.నా భర్త నాకోసం లిప్‌స్టిక్, చాక్లెట్స్ వంటి కొన్ని బహుమతులు పంపించాడు.
ప్రేమికుల రోజు ఈ వారంలోనే వస్తుండటంతో మా ఆయన ఎన్నో బహుమతులు ఇస్తున్నాడు.

అవన్నీ మీకు చూపించాలని, నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను.కానీ మేము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం మొదలు పెట్టారు.అది చూసి చాలా బాధేసింది.
మేము కలిసే ఉన్నాం.నా జీవితంలో ఇంత ప్రేమ నేనెప్పుడూ పొందలేదు.
చాలా సంతోషంగా ఉంది.ఇలాంటి జ్ఞాపకాలు కూడబెట్టుకుంటున్నప్పుడు అన్నింటినీ మైమరిచిపోతున్నాను అని చెప్పుకొచ్చింది దివ్య శ్రీధర్.
ఈ వీడియో పై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు ఈ వయసులో ఇలాంటివి అవసరమా అంటూ నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు.







