టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్(allu arjun) కు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే.పుష్ప మూవీ తో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్నారు అల్లు అర్జున్.
ఈ సినిమాతో అల్లు అర్జున్ ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగింది.ఒకవైపు సినిమాలలో రికార్డులు బద్దలు కొట్టడం మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా బండి రికార్డులు సృష్టిస్తున్నారు.ఇంస్టాగ్రామ్(Instagram) లో అల్లు అర్జున్ ని ఫాలో అయ్యే వారి సంఖ్య 28.5 మిలియన్స్‌కి చేరుకుంది.

ఇన్‌స్టాగ్రామ్ లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ (allu arjun)రికార్డ్ సృష్టించారు.ఇన్‌స్టాలో బన్నీకి 28.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే.ఆయన మాత్రం కేవలం ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నారు.
ఆ ఒక్కరు మరెవరో కాదు అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డినే( Sneha Reddy).ఆమెను మాత్రమే బన్నీ ఫాలో అవుతున్నాడు.ఇన్‌స్టా లో స్నేహరెడ్డికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.ప్రస్తుతం ఆమెకు 9.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.బన్నీతో పాటు రామ్ చరణ్, చిరంజీవి, ఉపాసనలను కూడా స్నేహా రెడ్డి ఫాలో అవుతోంది.
బన్నీ మాత్రం మొదటి నుంచి ఎవరిని ఫాలో అవ్వడం లేదు.

కానీ రామ్ చరణ్ (Ram Charan)మొన్నటి వరకు అల్లు అర్జున్ ని ఫాలో అయ్యాడు.సడెన్ గా ఏం జరిగిందో కానీ.తాజాగా చరణ్ కూడా బన్నీని అన్ ఫాలో చేశాడు.
ప్రస్తుతం చరణ్ కి ఇన్‌స్టాలో 26 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా యన 38 మందిని ఫాలో అవుతున్నారు.అందులో అల్లు శిరీష్, చిరంజీవి, పవన్ కల్యాణ్ తో పాటు పలువురు మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ఉన్నారు.
ఇకపోతే అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది.
ఈ సినిమా ఇంత విజయం సాధించినా కూడా అల్లు అర్జున్ మాత్రం ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోయారని చెప్పాలి.అల్లు అర్జున్ సినిమా విడుదల సమయంలో జరిగిన సంధ్య థియేటర్ ఘటన వివాదాలు అల్లు అర్జున్ ని ఉక్కిరిబిక్కి చేసాయి.