డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్రమ వలసదారులకు వరుస షాకులిస్తున్న సంగతి తెలిసిందే.అమెరికాలో అక్రమంగా ఉంటున్న వివిధ దేశాలకు చెందినవారిని ఇప్పటికే విమానాలలో వారి వారి స్వదేశాలకు తరలించే కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇందులో భారతీయులు కూడా ఉన్నారు.ఇప్పటికే 104 మందిని అమృత్‌సర్ (Amritsar)విమానాశ్రయంలో దించింది ట్రంప్ ప్రభుత్వం.
తాజాగా మరో 170 నుంచి 180 మందితో రెండో విమానం భారత్‌కు రానుంది.వీరంతా డాంకీ రూట్(Donkey Route) లేదా ఇతర అక్రమ మార్గాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించి.
లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఒకటి నుంచి మూడేళ్లకు పైగా ఉంటున్న వ్యక్తులు.భారతీయ అధికారుల నుంచి ధ్రువీకరణ ఇంకా రానప్పటికీ.ఈ వారంలోనే బహిష్కరణ జరుగుతుందని అమెరికా పరిపాలన వర్గాలు తెలిపాయి.ప్రధాని నరేంద్రమోడీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump ,Prime Minister Narendra Modi) విస్తృతస్థాయి చర్చలు జరపడానికి వాషింగ్టన్‌లో ఉన్న సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తొలి బ్యాచ్‌తో కూడిన విమానం దిగిన న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి మాట్లాడుతూ.యూఎస్ తన సరిహద్దులను తీవ్రంగా అమలు చేస్తోందని, వలస చట్టాలను కఠినతరం చేస్తోందన్నారు.అక్రమ వలసదారులను బహిష్కరించడం ద్వారా తమ ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్ని పంపుతోందన్నారు.గతేడాది నవంబర్‌లో బహిష్కరణకు గురైన 18 వేల మంది అక్రమ వలసదారుల జాబితాను భారత ప్రభుత్వంతో అమెరికా పంచుకుంది.
భారతదేశం అక్రమ వలసలను సమర్ధించదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(External Affairs Minister S Jaishankar) ఇప్పటికే స్పష్టం చేశారు.కేవలం చట్టపరమైన చలనశీలతకు మాత్రమే తమ ప్రభుత్వం మద్ధతు ఇస్తుందని ఆయన తెలిపారు.

అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిలో పంజాబీలు ఎక్కువగా ఉన్నారు.ఈ పరిణామాలపై పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఏజెంట్ల మోసాలు వెలుగుచూసిన తర్వాత కూడా బాధితులు వారిపై అధికారికంగా ఫిర్యాదు చేయడానికి ఇష్టపడరని కుల్దీప్ సింగ్ తెలిపారు.తాము పొగొట్టుకున్న డబ్బులో కొంతైనా తిరిగి ఇస్తారన్న ఆశతో బాధితులు ఉంటారని .కానీ ట్రావెల్ ఏజెంట్ల మోసాలపై ఫిర్యాదు చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ఆయన కోరారు.