వైరల్ అవుతున్న ప్రభాస్ ముగ్గురు చెల్లెళ్ల ఫోటో.. ఈ ఫోటోపై నెటిజన్ల రియాక్షన్ ఇదే!

పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్( Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ఓ ప్రభాస్.

 Prabhas Three Sisters Viral Photos Details, Prabhas, Prabhas Sisters, Prabhas Si-TeluguStop.com

చేతి నిండా బోలెడు సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు.అయితే ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే.

ఆ కానీ ఆయన ఫ్యామిలీ గురించి మనం చాలా తక్కువగా వార్తలు చూస్తూ ఉండటం వింటూ ఉంటాం.ఆయన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు( Krishnam Raju ) గురించి మనందరికీ తెలిసిందే.

పెద్దమ్మ నిర్మలా దేవి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒక అలాగే వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది తప్ప ఇదివరకటి రోజుల్లో అనగా కృష్ణంరాజు బతికున్నప్పుడు ఎప్పుడూ కూడా ఆమె అంత యాక్టివ్ గా కనిపించలేదు.

Telugu Krishnam Raju, Prabhas, Prabhas Sisters, Shyamala Devi-Movie

ఇక అయినా ముగ్గురు కూతుర్ల గురించి అయితే చాలామందికి తెలియదు.వారి ఫోటోలు కూడా సరిగ్గా సోషల్ మీడియాలో వైరల్ అయింది లేదు.అయితే తాజాగా ప్రభాస్ ముగ్గురు చెల్లెల( Prabhas Three Sisters ) ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ప్రభాస్‌ కి సొంత చెల్లెలు లేరు.కానీ కృష్ణం రాజు కుమార్తెలు అయిన ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తిలను సొంత చెల్లెలు కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటాడు.

వారికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రభాస్ ప్రమేయం ఉంటుందని అంటారు.వారికి తండ్రి స్థానంలో ఉండి ప్రభాస్ అన్ని తానై చూసుకుంటాడు అనే టాక్‌ కూడా ఉంది.

ఇటీవల కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి( Shyamala Devi ) తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌ కి హాజరు అయ్యారు.

Telugu Krishnam Raju, Prabhas, Prabhas Sisters, Shyamala Devi-Movie

కాగా ఆ కార్యక్రమంలో ప్రభాస్ సైతం పాల్గొనాల్సి ఉన్నా షూటింగ్‌ తో బిజీగా ఉన్న కారణంగా ఆయన హాజరు కాలేక పోయారు.ఆ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ప్రభాస్ ముగ్గురు సిస్టర్స్‌ ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తిలు తల్లి శ్యామలా దేవితో కలిసి ఇలా ఫోటోకు ఫోజ్ ఇచ్చారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

ప్రభాస్ చెల్లెలు అంటూ వీరి ఫోటోలను రెబల్‌ ఫ్యాన్స్ తెగ షేర్‌ చేస్తున్నారు.చాలా కాలం తర్వాత రెబల్‌ సిస్టర్స్ ఫోటోలు సోషల్‌ మీడియా ద్వారా రావడంతో అందరి దృష్టిన ఆకర్షించారు.

ఆ ఫొటోస్ పై ప్రభాస్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇకపోతే డార్లింగ్ ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజాసాబ్‌ సినిమాను ఈ సమ్మర్‌ చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.మరో వైపు హను రాఘవపూడి దర్శకత్వంలోనూ ఒక సినిమా రూపొందుతోంది.

ఫౌజీ వర్కింగ్‌ టైటిల్‌ తో ఆ సినిమా జెట్‌ స్పీడ్‌గా షూటింగ్‌ జరుపుకుంటుంది.సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు ప్రభాస్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube