రాజ్ తరుణ్( Raj Tarun ) ప్రేమికురాలు లావణ్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.లావణ్య, మస్తాయిన్ సాయిపై( Lavanya, Masainan Sai ) పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు మస్తాన్ సాయిని ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెబుతాను అంటూ లావణ్య షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో లావణ్య మాట్లాడుతూ రాజ్ తరుణ్ కు క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు.
రాజ్ తరుణ్ ఒక్కడే ఉంటే అతని కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడిగేదాన్నని ఆమె తెలిపారు. ఏ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదని లావణ్య అన్నారు.నా జీవితం నాశనం కావడానికి మస్తాన్ సాయి అతని కుటుంబం కారణం అని లావణ్య వెల్లడించారు.

మస్తాన్ సాయి తప్పు చేశాడు అని చెప్పినా అతడికే సపోర్ట్ చేశారు అని లావణ్య పేర్కొన్నారు.రాజ్ తరుణ్ తో నేను చాలా సంతోషంగా ఉండేదాన్నని లావణ్య తెలిపారు.మస్తాన్ సాయి వచ్చినప్పటి నుంచి మా మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని ఆమె వెల్లడించారు.
లావణ్య చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.రాజ్ తరుణ్ ఈ కామెంట్లపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

రాజ్ తరుణ్ వివాదాల్లో చిక్కుకోవడం వల్ల ఆయన కెరీర్ కూడా ప్రమాదంలో పడింది.రాజ్ తరుణ్ రెమ్యునరేషన్ ( Remuneration )కూడా పరిమితంగానే ఉంది.రాజ్ తరుణ్ తర్వాత సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.లావణ్యపై కూడా కొన్ని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.లావణ్యకు రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయేమో చూడాల్సి ఉంది.లావణ్య గురించి కూడా పలువురు ప్రముఖులు నెగిటివ్ కామెంట్లు చేస్తుండటం కొసమెరుపు.







