ఏంటీ వర్క్ ఫ్రం హోమ్ ఏంటి, వర్క్ ఫ్రం కారు ( Work from car )ఏంటి అనుకుంటున్నారా? అవును, మీరు చదువుతున్నది నిజమే.బెంగళూరులో ఓ యువతి ట్రాఫిక్ రూల్స్‌కి పూర్తిగా బ్రేక్ చేసి, కారు డ్రైవింగ్ చేస్తూనే ల్యాప్‌టాప్ మీద వర్క్ చేసింది.
ఓ యువతి ఒకే సమయంలో కారు నడుపుతూ ల్యాప్ టాప్‌తో తెగ వర్క్ చేసింది.దీన్ని చూసిన స్థానికులు షాక్ అయ్యి వెంటనే ఈ సాహసాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.
ఆ వీడియో అలా షేర్ అవుతూ.లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తుంది.

ఈ వీడియో కాస్తా బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల ( Bangalore Traffic Police )కంట పడగా.పోలీసులు ఆ యువతికి మంచి గుణపాఠం చెప్పారు.ఓవర్‌స్పీడ్, అజాగ్రత్త డ్రైవింగ్‌కి ఏకంగా రూ.1,000 జరిమానా కూడా విధించారు.జరిమానా మాత్రమే కాకుండా, “కారు కాదు ఇంట్లో కూర్చొని పని చేయండి” అంటూ తెలివైన సూచన కూడా ఇచ్చారు.నిజానికి, ఇలాంటి ఘటనలు మరికొన్ని నిజమయ్యే రోజులు ఎక్కువ దూరంలో లేవేమో.

నిజానికి ఆ యువతి ల్యాప్‌టాప్‌తో పని చేస్తూ కారు నడపడం వెనుక అసలు కథ ఏంటో ఎవరికీ తెలీదు.కానీ నెటిజన్లు మాత్రం కామెంట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు.“కారులో పని చేస్తే ఫ్యూయల్ ఖర్చు కడతారు.అదే ఆఫీస్ అయితే ఫ్రీ Wi-Fi వస్తుంది!” అని కొందరు సరదాగా కామెంట్ చేస్తే, మరికొందరు “డెడ్‌లైన్ తప్పితే బాస్ మొహం చూడటం కంటే ట్రాఫిక్ ఫైన్ కట్టడమే మేలు” అంటూ సెటైర్లు వేస్తున్నారు.మరికొందరేమో.“వర్క్ ఫ్రం హోమ్ మోడల్ బోర్ కొట్టిందేమో… వర్క్ ఫ్రం కార్ ట్రై చేసింది!” , “అబ్బా, మల్టీటాస్కింగ్ అంటే ఇదే!”, “డ్రైవ్ చేయడమా? లేక సాఫ్ట్‌వేర్ కోడింగ్ రాయడమా? రెండూ ఒకేసారి ఎలా?” అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.







