టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood Industry ) ఈ మధ్య కాలంలో వరుస ఆఫర్లను సొంతం చేసుకున్న నటీమణులలో ఊర్వశి రౌతేలా( Urvashi Rautela ) ఒకరు.డాకు మహారాజ్ సినిమాతో ఊర్వశి రౌతేలా భారీ సక్సెస్ ను అందుకున్నారు.
చిరంజీవి తనకు, తన ఫ్యామిలీకి దైవంతో సమానమని ఊర్వశి అన్నారు.సినిమాలో నటించిన చిన్న పరిచయంతో చిరంజీవి మాకు ఎంతో సహాయం చేశారని ఊర్వశి రౌతేలా చెప్పుకొచ్చారు.
అందుకే ఆయనను దైవంలా భావిస్తున్నామని ఊర్వశి వెల్లడించారు.
తమ బలానికి చిరంజీవి( Chiranjeevi ) లైట్ హౌస్ లాంటివారని ఆమె పేర్కొన్నారు.
కొంతకాలం క్రితం ఊర్వశి రౌతేలా తల్లి మీనూ రౌతేలా ఆస్పత్రిపాలయ్యారు.మీనూ రౌతేలా ఎడమ కాలి ఎముకలో ఇంట్రా ఆర్టిక్యూలర్ ఫ్రాక్చర్ ( Intra-articular fracture )కాగా ఆ ఫ్రాక్చర్ చాలా ప్రమాదకరం అని వైద్యులు చెప్పడంతో ఊర్వశీ రౌతేలా చిరంజీవి సహాయం కోరారు.
ఆ సమయంలో చిరంజీవి కోల్ కతా అపోలో ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి మీనూ రౌతేలాకు మెరుగైన వైద్యం అందేలా చేశారు.

డాక్టర్లు సర్జరీ చేయడంతో మీనూ రౌతేలా ఆ సమస్య నుంచి కోలుకున్నారు.ఈ విషయంలో తన కుటుంబం చిరు కుటుంబానికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.చిరంజీవి గారి సేవా కార్యక్రమాల( Service programs ) గురించి నేను ఎంతో విన్నానని ‘వాల్తేరు వీరయ్య’ సాంగ్ షూటింగ్ సమయంలో చిరంజీవి గారిని నేను గమనించానని ఆమె చెప్పుకొచ్చారు.

ఆపదలో ఉన్న ఎంతోమందికి చిరంజీవి సహాయం చేశారని ఊర్వశి రౌతేలా తెలిపారు.చిరంజీవి గారు నిర్భయంగా ఉండాలని చెప్పి మంచి వైద్యం అందేలా చేశారని ఊర్వశి తెలిపారు.భూమ్మీద ఇంకా మంచి, మానవత్వం ఉందని చిరంజీవి గారు ప్రూవ్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు.ఊర్వశి రౌతేలా వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఊర్వశి వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.







