టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత స్టార్ హీరోయిన్(Samantha star heroine) స్టేటస్ తో విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.సమంత చేతిలో ఇప్పటికీ చెప్పుకోదగ్గ ఆఫర్లు ఉన్నాయి.
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏ బంధమైనా ముగిసిపోతుందని సమంత పేర్కొన్నారు.సమంత(Samantha) తన పోస్ట్ లో మీరు అద్భుతమైన భాగస్వామితో మంచి బంధాన్ని కలిగి ఉండొచ్చని ఆమె అన్నారు.
నిజమైన ప్రేమకు అది అన్ని రకాల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సమంత చెప్పుకొచ్చారు.కానీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోని పక్షంలో కోరుకున్న విధంగా భాగస్వామికి కనిపించలేరని సమంత అభిప్రాయపడ్డారు.
ఉదాహరణకు ఎదుటి వ్యక్తిలో అంతా చక్కగా ఉందని మనం అనుకుంటామని ఆమె పేర్కొన్నారు.కానీ మన మనసు శరీరం ఎలా ఉంది అనే విషయాలను మాత్రం మనం గుర్తించం అని సమంత చెప్పుకొచ్చారు.

అలాంటప్పుడు ఏదో ఒక సమయంలో ఆ వ్యక్తిని కోల్పోవాల్సిందే అని ఆమె వెల్లడించారు.సమంత అకస్మాత్తుగా ఈ విధంగా పోస్ట్ పెట్టడం విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సమంత సిటాడెల్ వెబ్ సిరీస్(Samantha Citadel Web Series) తో ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తున్నారు.

స్టార్ హీరోయిన్ సమంత రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అవుతున్న సమంత ఈ ఏడాది ఎన్ని సినిమాలను రిలీజ్ చేస్తుందో చూడాల్సి ఉంది.సమంత నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఓటు వేస్తుండగా కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.సమంతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.హీరోయిన్ సమంత ఎంచుకునే ప్రాజెక్ట్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.