సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది సర్వసాధారణం.ఇప్పటికే ఎంతోమంది హీరోల పిల్లలు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇక మెగా వారసుడిగా రాంచరణ్ ( Ram Charan ) కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి( Chiranjeevi ) తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఇప్పుడు ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు.
ఇక చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు.
కేవలం వారసత్వాన్ని మాత్రమే అందుకున్న చరణ్ తన తండ్రి సహాయం లేకుండా ఇండస్ట్రీలో విజయాలను సాధిస్తూ తండ్రికి మించిన తనయుడు అనే పేరు సంపాదించుకున్నారు.
ప్రస్తుతం చరణ్ పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు.ఇలాగే మెగా వారసత్వం కొనసాగాలి అంటే చరణ్ కి కొడుకు పుట్టాల్సిందే.
చరణ్ ఉపాసన( Upasana ) పెళ్లి చేసుకున్న తర్వాత దాదాపు 11సంవత్సరాలకు అమ్మాయికి జన్మనిచ్చారు.

ఇక తనకు కొడుకు పుడితే బాగుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు ఇలాంటి తరుణంలోనే చిరంజీవి సైతం చరణ్ కి కొడుకు పుట్టాలి అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.తాజాగా ఈయన బ్రహ్మానందం నటించిన బ్రహ్మ ఆనందం సినిమా( Brahma Anandam Movie ) ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు.ఇందులో భాగంగా ఈయన వారసత్వం గురించి మాట్లాడారు చరణ్ కి కూడా కొడుకు పుడితే బాగుంటుంది తన వారసత్వాన్ని అలాగే కొనసాగిస్తారని తెలిపారు.

ప్రస్తుతం నా ఇల్లు మొత్తం మనవరాళ్లతో నిండిపోయింది ఇంట్లో ఉంటే కనుక నాకు ఏదో లేడీస్ హాస్టల్( Ladies Hostel ) లో వార్డెన్ లాగా ఉన్న అనుభూతి కలుగుతుందని అందుకే చరణ్ కి కొడుకు పుట్టాలని కోరుకుంటున్నానని తెలిపారు.చరణ్ ఒక కొడుకుని కనురా అంటూ తాను ఎప్పుడూ అడుగుతూ ఉంటాను.వాళ్ళు ఎక్కడ మరి కూతురికి జన్మనిస్తారేమోనని భయంగా ఉంది అంటూ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.