రూల్స్ ప్ర‌కారం బికినీలు వేసుకోలేద‌ని హ్యాండ్‌బాల్ టీమ్‌కు భారీ ఫైన్‌..

ప్ర‌తి ఆట‌లో కొన్ని రూల్ష్ ఉంటాయి.కానీ అవి హ‌ద్దులు దాటితేనే వివాదాస్ప‌దం అవుతుంటాయి.

 A Heavy Fine For The Handball Team For Not Wearing Bikinis According To The Rule-TeluguStop.com

ఇప్పుడు బీచ్ హ్యాండ్ బాల్ విష‌యంలో కూడా ఇలాగే జ‌రుగుతోంది.ఈ గేమ్ లో అమ్మాయిలు క‌చ్చితంగా రూల్స్ ప్ర‌కారం బికినీలే వేసుకోవాలని లేదంటే ఆడ‌టానికి వీలు లేదంటూ పెట్టిన రూల్ తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది.

కాబ‌ట్టి దీన్ని స‌వ‌రించాలంటూ ఇప్ప‌టికే 5 దేశాలు విజ్ఞ‌ప్తి కూడా చేశాయి.ఇక రీసెంట్ గా బల్గేరియాలోని వర్నా సిటీలో జ‌రిగిన‌టువంటి యూరోపియన్ బీచ్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ టోర్న‌మెంట్‌లో ఓ వివాదం చెల‌రేగింది.

అదేంటంటే ఇందులో పాల్గొన్న నార్వే మహిళల టీమ్ బికినీలు వేసుకోకుండా షార్ట్స్ వేసుకోవ‌డంతో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.రూల్స్ కు విరుద్ధంగా షార్ట్స్ ఎందుకు వేసుకున్నార‌ని సదరు మ‌హిళ‌ల టీమ్ మీద యూరోపియన్ హ్యాండ్ బాల్ సమాఖ్య ఫైర్ అయింది.

అంతే కాదు ఆ టీమ్‌కు భారీగా ఫైన్ విధించింది. దాదాపు 1500 యూరోలు కట్టాలంటూ ఆదేశాలు జారీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.ఈ సమాఖ్య రూల్స్ ప్రకారం క్రీడాకారిణులు క‌చ్చితంగా బాటమ్ బికినీలు ధరించాలి.అంతే కాదు ఈ బికినీల్లో కూడా సైజులు కూడా ఉంటాయి.

Telugu Uros Fine, Handball, Narvey Hand, Narvey Womens-Latest News - Telugu

ఈ బిక‌నీలు నాలుగు అంగుళాల కంటే పెద్ద సైజులో ఉండొద్దు.కానీ నార్వే జ‌ట్టు మాత్రం రూల్స్‌ను ప‌క్క‌న పెట్టేసి ఆడింది.కాగా త‌మ టీమ్ క్రీడాకారిణుల నిర్ణయాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్టు నార్వే హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ప్ర‌క‌టించింది.ఇలాంటి మార్పు అవ‌స‌ర‌మంటూ చెప్పింది.గ‌తంలోనే తాము ఈ రూల్‌ను మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఫెడ‌రేష‌న్ తెలిపింది.వాస్త‌వానికి ఆడేందుకు వీలుగా ఉండే ఎలాంటి దుస్తులను అయినా ధరించడంలో తప్పేముందని అభిప్రాయ‌ప‌డింది.

ఆట తీరులో ఎలాంటి మార్పు లేన‌ప్పుడు బ‌ట్ట‌లు ఎలా ఉంటే ఏంటంటూ ప్ర‌శ్నించింది.ఈ వివాదంపై నార్వే జ‌ట్టుకు అంద‌రూ అండ‌గా నిలుస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube