కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ అనుకొని గోల్‌కీప‌ర్‌ను ట్యాగ్ చేస్తున్న నెటిజ‌న్లు.. ఆయ‌న ఏమ‌న్నారంటే..?

ఇప్పుడు పంజాబ్ రాజ‌కీయాలు దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నంగా మారాయో అంద‌రికీ తెలిసిందే.దీంతో నెటిజ‌న్లుఅ అంద‌రూ కూడా కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ ఉట్టూ కామెంట్లు పెడుతున్నారు.

 Netizens Tagging Goalkeeper As Captain Amarinder Singh Thinks, Amarinder Singh,-TeluguStop.com

అయితే సోష‌ల్ మీడియాలో అప్పుడ‌ప్పుడు కొన్ని ప‌రొపాట్లు కూడా జ‌రుగుతుంటాయి.ఇప్పుడున్న టెక్నాలజీ కార‌ణంగా అది ఈజీగానే జ‌రిగిపోతోంది.

ఇక పంజాబ్ రాజ‌కీయాల దుమారం దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న త‌రుణంలో పేర్ల విష‌యంలో చాలామంది పొరపాటు ప‌డుతున్నారు.దీంతో ఇప్పుడు ఓ స్టార్ ఆట‌గాడు ఇబ్బందులు ప‌డుతున్నాడు.

అస‌లు విష‌యం ఏంటంటే పంజాబ్ మాజీ సీఎం పేరు కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌.అలాగే మ‌న ఇండియా ఫుట్‌బాల్‌ టీం గోల్‌ కీపర్ పేరు కూడా అమరీందర్‌ సింగ్‌.

దీంతో అటు మీడియాతో పాటు వెబ్‌సైట్లు, అలాగే నెటిజన్స్ కూడా ఈ విష‌యంలో పోస్టులు పెడుతూ ట్వీట్లు చేస్తూ గోల్ కీప‌ర్ అమ‌రీంద‌ర్ సింగ్‌ను ట్విటర్‌లో ట్యాగ్‌ చేస్తున్నారట.రోజుకు వేలాది మంది ట్యాగ్ చేయ‌డంతో ఈ గోల భరించలేక గోల్ కీప‌ర్ అమ‌రీంద‌ర్ సింగ్ స్వ‌యంగా ట్విటర్‌లో రియాక్ట్ అయ్యాడు.

కాక‌పోతే ఆయ‌న దాన్ని సీరియ‌స్‌గా కాకుండా ఫ‌న్నీగా ట్వీట్ చేశాడు.

Telugu Amarinder Singh, Keeperamarinder, Indiafootball, Pubjab, Punjabcm, Footba

తాను గోల్ కీప‌ర్‌ను అని, పంజాబ్ మాజీ సీఎంను కాన‌ని, కాబ్ట‌టి దయచేసి మీడియా, నెటిజ‌న్లు త‌న‌ను ట్యాగ్ చేయొద్దంటూ రిక్వెస్ట్‌లు చేశాడు.దీంతో అంద‌రూ షాక్ అయిపోయారు.అప్ప‌టి వ‌ర‌కు పంజాబ్ మాజీ సీఎం అనుకుని ఆయ‌న్ను తెగ ట్యాగ్ చేసేస్తూ ట్వీట్ల మోత మోగించిన వారంతా కూడా భలేగా రియాక్ట్‌ అవుతున్నారు.

ఇద్ద‌రి పేర్లు సేమ్ కావ‌డంతో ఇలా జ‌రిగింద‌ని అంద‌రూ ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు.ఇంకొంద‌రు అయితే నువ్వు ఫుట్‌బాల్ టీమ్‌కు కెప్టెన్‌ అయ్యి ఉంటే గ‌న‌క అప్పుడు ఎవ‌రినీ గుర్తు ప‌ట్టేందుకు వీలుండేది కాదంటూ చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube