రెమ్యునరేషన్ గుట్టు విప్పిన పవన్ కళ్యాణ్.. అప్పట్లో ఎంత తీసుకునేవారంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఇతర స్టార్ హీరోలను మించి ఉందనే సంగతి తెలిసిందే.50 కోట్లకు పైగా రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలలో పవన్ ఒకరు.తొలి సినిమాకు పవన్ 5,000 రూపాయలు రెమ్యునరేషన్ ఆ తర్వాత సినిమాలకు పవన్ ఎంత తీసుకున్న వివరాలు తెలియలేదు.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎకరం లక్ష రూపాయలు ఉన్న సమయంలోనే తన సంపాదన కోటి రూపాయలు అని చెప్పారు.

 Star Hero Pawan Remuneration Few Years Back Details Here , Pawan Remuneration ,-TeluguStop.com

15 సంవత్సరాల క్రితం పవన్ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే వారని తెలుస్తోంది.ఖుషి తర్వాత పవన్ కు సరైన హిట్ లేకపోవడంతో పవన్ కొన్నేళ్ల పాటు తన రెమ్యునరేషన్ ను పెంచలేదు.

మరోవైపు పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో ఘాటు పెంచారు.ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.జనసేన విసృతస్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలను బేస్ చేసుకుని విమర్శలు చేశారు.

Telugu Crore, Chiranjeevi, Janaseena, Pawan Kalyan, Tollywood-Movie

తనకు ఓటమి భయం, ప్రాణ భయం లేదని వైసీపీ దుష్టపాలనను అంతమొందించడానికి వ్యూహాలను మారుస్తానని పవన్ చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆన్ లైన్ టికెట్ల అంశం గురించి స్పందించి వైసీపీ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేయడం వల్ల వివాదం మొదలైంది.ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

Telugu Crore, Chiranjeevi, Janaseena, Pawan Kalyan, Tollywood-Movie

మరోవైపు ఈ వివాదం విషయంలో టాలీవుడ్ స్టార్ హీరో అయిన చిరంజీవి సైతం మౌనంగానే ఉన్నారు.పవన్ తీరుపై చిరంజీవి చింతించారని వైసీపీ మంత్రులు చెబుతున్నా చిరంజీవి బహిరంగంగా స్పందిస్తే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.మరోవైపు పవన్ పై పోసాని చేసిన కామెంట్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పోసాని తాజాగా మీడియాతో మరోసారి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube