బుల్లెట్టు బండి పాటకి డ్యాన్స్ చేయడం రాదని పెళ్లి క్యాన్సిల్ అయ్యిందట...

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగులో అప్పట్లో ప్రసారమయ్యేటువంటి “కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే ధారావాహిక ద్వారా నటిగా తన సినీ కెరీర్ ని ప్రారంభించి బాగానే సక్సెస్ అయిన తెలుగు బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హిమజ గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ప్రముఖ రియాల్టీ గేమ్ షో అయినా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని తన నటనా ప్రతిభను నిరూపించుకుని బాగానే ఆకట్టుకుంది.

 Telugu Actress Himaja Reddy Bullet Bandi Song Reel Viral In Social Media, Himaj-TeluguStop.com

దీంతో అప్పటి నుంచి ఈ అమ్మడి సినిమా కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ లో పెద్దగా నటించడం లేదు.

కానీ సినిమాలలో మాత్రం వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకు పోతోంది.మరోవైపు పలురకాల షోలు, ఈవెంట్లలో కూడా పాల్గొంటూ రెండు చేతులా సంపాదిస్తుంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో నటి హిమజా సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.అంతేకాకుండా అప్పుడప్పుడూ పలు రకాల ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేస్తూ తన అభిమానులను బాగానే అలరిస్తోంది.

కాగా తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా చేసినటువంటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే తన స్నేహితురాలి పెళ్లి పెటాకులైందనే విషయం గురించి చెబుతూ తన స్నేహితురాలికి ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్న బుల్లెట్ బండి సాంగ్ కి డాన్స్ చేయడం రాకపోవడంతో వరుడు కుటుంబ సభ్యులు పెళ్లి వద్దన్నారని సరదాగా అందరిని నవ్వించింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అలాగే కొందరు నెటిజనులు ఈ వీడియోపై స్పందిస్తూ బుల్లెట్ బండి సాంగ్ కి డాన్స్ చేయడం రాకపోతే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారా.అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్యన టివి మజా తెలుగులో అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించి హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఈ చిత్రానికి నూతన దర్శకుడు సైది రెడ్డి దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత గోవర్ధనరెడ్డి కందుకూరి నిర్మించారు.కాగా ప్రస్తుతం నటి హిమజా రెడ్డి తెలుగులో ప్రముఖ హీరో మరియు కమెడియన్ సునీల్ హీరోగా నటిస్తున్న కనబడుట లేదు చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube