1.విదేశీయులకు ఆస్ట్రేలియా స్పెషల్ వీసాలు
ప్రతిభావంతమైన విదేశీయులకు స్వాగతం పలకాలని ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు స్పెషల్ వీసాలను ప్రవేశపెట్టనుంది.నిపుణుల కొరత ఉన్న పరిశ్రమలు, సేవా రంగాలలో పనిచేసే వారికి ఈ స్పెషల్ వీశాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది.
2.అమెరికా సెనేట్ లో కీలక బిల్లు .ఎన్నారై పిల్లలకు లబ్ది.
నాన్ ఇమిగ్రెంట్ వీసా పై అమెరికా వలస వెళ్లిన వారి పిల్లలకు పౌరసత్వం కల్పించే బిల్లుకు సెనేటర్లు అలెక్స్ పడిల్లా, రాండ్ పాల్ ‘ అమెరికా చిల్డ్రన్ యాక్ట్ ‘ పేరిట సెనేట్ లో కీలక బిల్లుని ప్రవేశపెట్టారు.
3.చైనా కు చెక్ పెట్టాలా అమెరికా కొత్త ఎత్తు
దక్షిణాసియా లో చైనా రోజు రోజుకీ తన దూకుడు పెంచుతూ ఇతర దేశాల పై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో దానిని తిప్పికొట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే ఆసియాలోని ఇండియా, జపాన్ ఆస్ట్రేలియాతో కలిసి ఇప్పటికే క్వాడ్ కూటమిని ఏర్పాటు చేసిన అమెరికా, ఇప్పుడు బ్రిటన్, ఆస్ట్రేలియాతో కలిసి కూటమిని ఏర్పాటు చేసింది.
4.తాలిబన్ నేతల మధ్య ఆధిపత్య పోరు
స్వాధీనం చేసుకున్న ఖాళీగా ఉంది ఇప్పుడు అంతర్గత విభేదాలతో సతమతమవుతున్నారు.కీలక స్థానాల్లో ఉన్న నేతలు కలత చెందడం ఇప్పుడు తాలిబాన్లకు పెద్ద సమస్యగా మారింది.
ప్రస్తుతం తాలిబన్ క్యాబినెట్లో ఉన్న వారంతా కరుడుగట్టిన ఉగ్రవాదులు.హక్కానీ నెట్వర్క్ వంటి సంస్థలకు చెందిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు.క్యాబినెట్ లో తోటి విషయంలో ఆచరణ వాదులు, సిద్ధాంతకర్తల మధ్య ఘర్షణత్మక వాతావరణం నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
5.పాకిస్తాన్ పర్యటన ను రద్దు చేసుకున్న న్యూజిలాండ్
పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ చివరి నిముషం లో టోర్నీ ని రద్దు చేసుకుంది.
6.కమల హరీష్ హత్య కుట్ర లో మహిళకు ఐదేళ్ల జైలు
అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హార్స్ హత్య కుట్ర లో మహిళకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది.దక్షిణ ఫ్లోరిడాకు చెందిన నివియన్ పెటిల్ ఫెల్స్పీ అనే మహిళ కమల హరీష్ ను చంపేందుకు పేపర్లో కుట్రపన్నారు.
ఈమేరకు 53 వేల డాలర్ల ఒప్పందం కుదిరింది.ఈ కుట్ర బయట పడడంతో ఆమెను అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరచగా ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది.
7.అమెరికాను భయపడతున్న హవానా
అమెరికా లో హవానా సిండ్రోమ్ అనే కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది.అయితే ఇది కేవలం దౌత్య వెత్తలకే సోకడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.
8.భూమికి తిరిగొచ్చిన చైనా వ్యామోగాములు
ముగ్గురు చైనీస్ వ్యామోగాములు నీ హైషెంగ్ , లియు బోమింగ్ ,టాంగ్ హోగ్బో 90 రోజుల రోదసీ యాత్రను పూర్తి చేసుకుని క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు.
9.ఆఫ్గాన్ లో ఆకలి కేకలు
ఆఫ్గానిస్థాన్ లో పరిస్థితి దారుణంగా తయారయ్యింది.ప్రజలు ఆకలి బాధలతో విలవిల్లాడుతున్నారు.పొట్ట నింపుకునేందుకు ఇంట్లోని వస్తువులను అమ్మకానికి పెట్టి ఆకలి బాధలు తీర్చుకుంటున్నారు.
10.ఆకశ్ కూటమితో వెన్నుపోటు పొడిచారు : ఫ్రాన్స్
ఆస్ట్రేలియాకు అణ్వాయుధ సహాయం అందించేందుకు ఆకస్ పేరుతో అమెరికా , బ్రిటన్ , ఆస్ట్రేలియాలు కటమి ఏర్పాటు చేయడం పై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి.ఆ కూటమి తమకు వెన్నుపోటు పొడిచిందని ఫ్రాన్స్ ఆరోపించింది.