ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరి ఇళ్లల్లోనూ నిమ్మకాయలను విరి విరిగా వినియోగిస్తుంటారు.పోషకాలు మెండుగా ఉండే ఈ నిమ్మ.
ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలోనూ, అధిక బరువు తగ్గించడంలోనూ, శరీరాన్ని శుభ్రపరచడంలోనూ, చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలోనూ ఇలా ఎన్నో ఎన్నెన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.అందుకే చాలా మంది ఉదయ్యానే నిమ్మ రసాన్ని తీసుకుంటుంటారు.
అయితే ఎన్ని పోషకాలు ఉన్నప్పటికీ, ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.కొండరు మాత్రం నిమ్మకు దూరంగా ఉండాల్సిందే.
ఆ కొందరు ఎవరో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారనంగా గర్భిణీ స్త్రీలకు పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది.ఈ క్రమంలోనే నిమ్మ రసాన్ని తెగ వాడుతుంటారు.అయితే గర్భిణీలు నిమ్మకాయలను ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపునులు చెబుతున్నారు.
ఎందుకంటే, ప్రెగ్నెన్సీ సమయంలో దాదాపు అందరూ ఐరన్ మాత్రలను వేసుకుంటారు.ఇలా ఐరన్ మాత్రలు వేసుకునే వారు నిమ్మకాయను అతిగా తీసుకోరాదు.
అలా తీసుకుంటే నిమ్మలోని కొన్ని పోషకాలు ఆ మాత్రల ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది.దాంతో రక్తహీనతకు దారి తీస్తుంది.
నోటి అల్సర్ తో బాధ పడే వారు కూడా నిమ్మకాయలను దూరం పెట్టాలి.నిమ్మలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది.ఇది నోటి అల్సర్‌ను మరింత పెంచడమే కాదు తీవ్రమైన నొప్పి గురి చేస్తుంది.నోటి ఆల్సర్ మాత్రమే కాకుండా కడుపు అల్సర్ ఉన్నా నిమ్మను ఎవాయిడ్ చేయడమే మేలు.
అలాగే దంతాల పోటు, దంతాల బలహీనత మరియు ఇతర దంత సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారూ నిమ్మ కాయలను తీసుకోరాదు.పైన చెప్పుకున్నట్టు నిమ్మలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.
ఇది దంత సమస్యలను తీవ్ర తరం చేసేస్తుంది.
మైగ్రైన్ తల నొప్పి బాధితులు సైతం నిమ్మ కాయలను తీసుకోరాదు.ఎందుకంటే, మైగ్రైన్ తల నొప్పిని రెట్టింపు చేసే శక్తిని నిమ్మకాయలకు ఉందని పలు పరిశోధనల్లో తేలింది.అందుకే మైగ్రైన్ ఉన్న వారు నిమ్మకు దూరంగా ఉండటమే ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.