టెలిగ్రామ్ యాప్ కొత్త వర్షన్.. అబ్బురపరిచే  ఫీచర్లు..!

ఇప్పుడిప్పుడే యూజర్లను పెంచుకుంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంటూ వస్తున్న ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్ టెలిగ్రామ్‌ గురించి మన అందరికి తెలిసిందే.సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు యూజర్లను పెంచుకుంటూ వస్తుంది.ఈ క్రమంలో చాలా సరికొత్త ఫీచర్లతో టెలిగ్రామ్ 8.0 బీటా వెర్షన్ రిలీజ్ చేసింది.స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ టెలిగ్రామ్ 8.0 బీటా వెర్షన్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.మరి 8.0 వెర్షన్ లో గల ఆప్షన్లు ఏంటో ఒకసారి చూద్దామా.

 Telegram Channel Telegram Beta Version Telegram Features, Telegram Update, Teleg-TeluguStop.com

ఇందులో కొత్త అప్షన్ ఏంటంటే.సాధరణంగా మనం ఎవరికన్నా మెసేజ్ పంపిస్తే వారికి పంపంచిన వారి డీటెయిల్స్ కనిపిస్తాయి కదా.కానీ హైడ్ సెండర్ నేమ్ అనే ఒక సరికొత్త ఫీచర్ వలన పేరుని దాచి మీరు అవతలి వ్యక్తికి మెసేజ్ ఫార్వార్డ్ చేయొచ్చు అన్నమాట.మరొక అప్షన్ ఏంటంటే.

టెలిగ్రామ్ ఛానెల్స్.అది ఎలా అంటే ఒక చాట్ లోని ఆఖరి మెసేజ్ నుంచి డైరెక్ట్ గా మరొక చాట్ లోకి వెళ్లేందుకు పైకి స్వైప్ చేస్తే సరిపోతుంది.

మీరు మిగతా ఛానళ్లను చూసుకోవచ్చు.

Telugu App, Beta, Channel, Sender, Themes-Latest News - Telugu

అలాగే ఇంకొక ఫీచర్ ఏంటంటే.మీరు ఇందులో మీ వాయిస్ చాట్‌ లను కూడా రికార్డ్ చేయవచ్చు.అలాగే వాయిస్ చాట్ తో పాటు  వీడియో సీక్వెన్స్ ను కూడా రికార్డ్ చేయొచ్చు అన్నమాట.

వీడియో రికార్డ్ చేయాలంటే మీరు వాయిస్ రికార్డ్ చేసే సమయంలో వాయిస్ ఓన్లీ కాకుండా వీడియో రికార్డ్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.అప్పుడే వీడియో కూడా రికార్డు అవుతుంది.

ఇప్పుడు ఎవరు చుసిన మెసేజ్ కి బదులుగా ఎమోజీలను లేదా స్టిక్కర్‌ లను సెండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో టెలిగ్రామ్ లో కూడా మీరు మెసేజ్ చేయడానికి బదులు అదే భావం వచ్చే అటువంటి ఎమోజీలు, స్టిక్కర్లు,  GIF పిక్చర్ లు మీకు అందుబాటులో ఉన్నాయి.

  అలాగే మెసేజ్ చేసే సమయంలో అనిమేషన్ కూడా ఉపయోగించుకోవచ్చు.  మీరు మెసేజ్ లను పంపించేటప్పుడు వాటి రంగులను కూడా మార్చుకోవచ్చు.

అలాగే ఈ రంగులతో పాటు యానిమేషన్లు కూడా చాట్ బబుల్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ కు కూడా అప్లై చేసుకునే ఫీచర్ ఈ వెర్షన్ లో అందుబాటులో కలదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube