సింగపూర్‌: క్యాబ్ డ్రైవర్‌పై అసభ్యకర వ్యాఖ్యలు, ఛార్జీ ఎగవేత.. భారత సంతతి వ్యక్తికి జైలుశిక్ష

విద్య, ఉపాధి, వ్యాపారాల కోసం పరాయి దేశానికి వెళ్లేవారు ఎందరో.అలాంటప్పుడు మనకు ఆశ్రయం కల్పించిన దేశంపైనా, అక్కడి ప్రజలపైనా గౌరవ భావంతో వుండాలి.

 Indian-origin Man Jailed For Abusing Taxi Driver In Singapore , Singapore, Taxi-TeluguStop.com

కానీ కొందరు భారతీయులు అక్కడి స్థానికులతో ఘర్షణాత్మకంగా వ్యవహరిస్తున్నారు.వారిని అసభ్య పదజాలంతో దూషించడమో, లేదంటే భౌతికదాడులకు దిగడమో చేస్తున్నారు.

అన్ని దేశాల్లోనూ ఈ సంస్కృతి లేనప్పటికీ. సింగపూర్‌లో స్థిరపడ్డ కొందరు భారతీయుల్లో మాత్రం ఈ తరహా మనస్తత్వం కాస్త ఎక్కువగా వుంది.

తాజాగా ఓ చైనా సంతతికి చెందిన ట్యాక్సీ డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు గాను న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.

వివరాల్లోకి వెళితే.

సహాయనాథన్ ఆంటోనీ అనే భారత సంతతి వ్యక్తి పబ్లిక్ ప్లేస్‌లో తాగి వుండటంతో పాటు చైనాకు చెందిన 66 ఏళ్ల టాన్ టేక్ హాక్‌తో అమర్యాదగా ప్రవర్తించాడు.దీనిపై నిందితుడు నేరాన్ని అంగీకరించాడని స్ట్రెయిట్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.

ఈ నేరానికి గాను అతనికి న్యాయమూర్తి రెండు వారాల మూడు రోజుల జైలు శిక్ష విధించారు.

సహాయనాథన్ , అతని భార్య గతేడాది అక్టోబర్ 30న జురోంగ్ ఈస్ట్ సెంట్రల్ సమీపంలోని తోహ్ గ్వాన్ రోడ్‌లో ట్యాక్సీ ఎక్కారు.

ఈ క్రమంలో క్యాబ్ డ్రైవర్‌ను సహాయనాథన్ ఆర్చర్డ్ రోడ్‌లోని ప్లాజా సింగపూర్ షాపింగ్ మాల్‌కు తీసుకెళ్లాల్సిందిగా చెప్పాడు.మాల్‌కు వెళుతుండగా సహాయనాథన్ ఆందోళనకు గురయ్యాడు.

డ్రైవర్ వారు వెళ్లాల్సిన గమ్యస్థానానికి ఎక్కువ దూరం వుండే మార్గాన్ని తీసుకున్నాడని భావించారు.దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.

డ్రైవర్‌ను అసభ్యకరంగా దూషించడం మొదలుపెట్టాడు.అనంతరం మాల్ వద్దకు చేరుకున్న తర్వాత సహాయనాథన్ 17.80 సింగపూర్ డాలర్లను క్యాబ్ డ్రైవర్‌కు చెల్లించలేదని స్టేట్ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ కోర్టుకు తెలియజేశారు.

మాల్ లోపల సెల్‌ఫోన్ కొని తిరిగి వస్తానని.

ఆ తర్వాత డబ్బులు చెల్లిస్తానని సహాయనాథన్.క్యాబ్ డ్రైవర్‌కు చెప్పినట్లుగా ప్రాసిక్యూటర్ తెలిపారు.

అతను తనను మోసం చేశాడని భావించిన క్యాబ్ డ్రైవర్.సహాయనాథన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube