బుల్లితెర కామెడీ షోలలో సంవత్సరాల తరబడి ప్రసారం కావడంతో పాటు ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటున్న షోలలో జబర్దస్త్ షో ఒకటి.ఈ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
తాజాగా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ పోలీస్ గెటప్స్ లో ఎంట్రీ ఇస్తారు.సుధీర్ హైపర్ ఆదితో జబర్దస్త్ చాలా గొప్ప షో అన్నా అని చెబుతాడు.
ఎందుకురా అని సుధీర్ అడగగా నిన్ను పట్టుకునే వాళ్లు వేసుకోవాల్సిన గెటప్ నువ్వు వేసుకుంటున్నవ్ కదా అని చెబుతాడు.
రోజా, అనసూయను కట్టేసి సుధీర్ రోజాను తొమ్మిదేళ్ల నుంచి రష్మీకి, నాకు మధ్య ఏదో ఉంది ఇద్దరినీ కలపాలని ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా అని సుధీర్ అడగగా నక్కిలీసు గొలుసు నెక్ కు ఉండాలని కుక్క గొలుసు కుక్కకు ఉండాలని రోజా చెబుతుంది.
నేను కుక్క గొలుసా అని సుధీర్ అడగగా క్లారిటీ బాగుంది అని రోజా చెబుతుంది.జబర్దస్త్ లో అనసూయ, రష్మీకి ఏ శాఖలు ఇస్తారని సుధీర్ అడుగుతాడు.
అనసూయ, రష్మీకి అయితే మైన్స్ శాఖలు ఇస్తానని ఎప్పటెప్పటివో తవ్వుకుంటూ ఉంటారని అందువల్ల ఆ శాఖ కరెక్ట్ అని రోజా చెబుతారు.
నాకు ఏ శాఖ ఇస్తారు అని సుధీర్ అడగగా నీకు శాఖలు ఎందుకోయ్ పాకలు, గుడిసెలు ఉన్నాయ్ కదా అని సుధీర్ చెబుతాడు.ఆ తర్వాత ఆది చేతులు కట్టేసి ఉన్న అనసూయతో నిన్ను విడిచిపెట్టాలంటే నాకు హగ్ ఇవ్వాలని చెబుతాడు.
ఆ తర్వాత అనసూయ హైపర్ ఆదికి హగ్ ఇస్తుంది.
బెదిరించి మరీ అనసూయ హగ్ తీసుకోవడం గమనార్హం.అదిరే అభి నేనొక హాస్యనటుడిని అని బోర్డ్ పెట్టగా రావడం రావడమే పంచ్ వేశావని రోజా చెబుతారు.