వామ్మో.. పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తే సీఎం జగన్‌కు పోటీ ఇస్తానంటున్న శ్రీరెడ్డి!

శ్రీరెడ్డి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా తీవ్రస్థాయిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

 Sri Reddy Shocking Comments On Pawan Kalyan Political Journey Sri Reddy, Pawan K-TeluguStop.com

అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా ఏ చిన్న అవకాశం దొరికినా సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.కేవలం సినిమాల పరంగా మాత్రమే కాకుండా సామాజిక, రాజకీయ అంశాలపై కూడా స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు.

ఇక ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతుంటాయి.

సోషల్ మీడియాలో నిత్యం ఎంతో యాక్టివ్ గా ఉండే శ్రీ రెడ్డి గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈమెకు ఏమైందా అంటూ పలువురు పెద్ద ఎత్తున కామెంట్లు చేయడంతో అందుకు స్పందించిన శ్రీ రెడ్డి తను డిప్రెషన్ లో ఉన్న కారణంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అందుకోసం గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నానని క్లారిటీ ఇచ్చారు.ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా శ్రీరెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Telugu Pawan Kalyan, Journey, Sri Reddy, Tollywood-Movie

ఒకరి పై ఎప్పుడు కామెంట్స్ చేస్తున్నానంటే జీవితాంతం వాళ్ళు నచ్చరని కాదు.అలాంటి వారిని వ్యక్తిగతంగా శత్రువు అనుకోవడం కూడా పొరపాటు.మన సాంప్రదాయాల ప్రకారం శత్రువు కనిపించిన చేతులెత్తి నమస్కరించాలి.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం ఇచ్చిన ఆయన సినిమాలలో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అదేవిధంగా వర్క్, ప్రొఫెషనలిజం పరంగా పవన్ కళ్యాణ్ పర్వాలేదు గానీ, రాజకీయాలు పవన్ కళ్యాణ్ కు సరిపోవు అనేది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు.అయితే ప్రతి ఒక్కరిలో మార్పు జరగవచ్చు, అదే కనుక జరిగితే భవిష్యత్తులో సీఎం జగన్మోహన్ రెడ్డికి గట్టి పోటి ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా శ్రీ రెడ్డి తెలియజేశారు.

ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube