అమెరికా దిగ్గజ సంస్థలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి.. ఎవరీ జార్జ్ థామస్..?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళ్లిన ప్రవాస భారతీయులు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.ఆర్ధిక, సామాజిక, రక్షణ, రాజకీయ, శాస్త్ర, సాంకేతికం ఇలా అగ్రరాజ్యంలోని కీలక రంగాల్లో భారత సంతతి ప్రజలు ఉన్నత స్థానాల్లో వున్నారు.

 George Thomas, Jll's Global Chief Information Officer, Adds To A Growing Roster-TeluguStop.com

రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి.తాజాగా చికాగో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రియల్ ఎస్టేట్ దిగ్గజం.

‘‘ జోన్స్ లాంగ్ లాసల్లె Inc ’’ (జేఎల్ఎల్)సంస్థలో ఓ ఇండో అమెరికన్ కీలక పదవి దక్కించుకున్నారు.ఈ సంస్థ గ్లోబల్ చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన జార్జ్ థామస్ నియమితులయ్యారు.

జార్జ్ థామస్‌కు జనరల్ ఎలక్ట్రిక్, హెచ్ఎస్‌బీసీ, జేఎల్ఎల్‌లో వివిధ హోదాల్లో 20 సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం వుంది.అమెరికా, యూరప్, ఆసియాలలో పలు ప్రాజెక్ట్‌లకు ఆయన నాయకత్వం వహించారు.

తన కొత్త ఉద్యోగంలో జార్జ్.ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ, స్ట్రాటజీ, సైబర్ వంటి రంగాల్లో 80 దేశాల్లో, 92000కు పైగా ఉద్యోగులతో వున్న జేఎల్ఎల్ వ్యవహారాలను చూడాల్సి వుంటుంది.

జేఎల్ఎల్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ లీడర్ షిప్ టీమ్‌లో కో సీఈవో మిహిర్ షా, యిషాయ్ లెర్నర్ నేతృత్వంలో జార్జ్ పనిచేయనున్నారు.

జేఎల్ఎల్‌కు భారతదేశంలో బెంగళూరులో గ్లోబల్ అంతర్గత సాంకేతిక కేంద్రం వుంది.

ఇక్కడ 700 మంది నైపుణ్యం కలిగిన టెక్ నిపుణులను నియమించారు.తద్వారా ప్రపంచవ్యాప్తంగా జేఎల్ఎల్ ఖాతాదారులకు ఏకీకృత డెలివరీ ఫ్లాట్‌ఫామ్‌గా ఇది సేవలు అందిస్తోంది.

బెంగళూరు కేంద్రాన్ని జార్జ్ తన స్ట్రాటజీ అమలు చేయడానికి వినియోగించుకోనున్నారు.

Telugu Addsroster, America, Ceo Mihir Shah, George Thomas, Ishai, Jlls, Long Las

కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన జార్జ్ థామస్.ఇండియాలోనే ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు.అనంతరం ఇంజనీరింగ్, బిజినెస్ రంగాల్లో మాస్టర్స్ కోసం ఆయన అమెరికాకు వెళ్లారు.

కేరళ యూనివర్సిటీ, కెంటుకీలోని లూయిస్ విల్లే వర్సిటీ, కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలోని గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జార్జ్ థామస్ చదువుకున్నారు.ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి సింగపూర్‌లో నివసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube