బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ప్రదీప్ ఒకరనే సంగతి తెలిసిందే.ప్రదీప్ పెళ్లికి సంబంధించి తరచూ వార్తలు వైరల్ అయినా ప్రదీప్ మాత్రంపెళ్లి గురించి స్పందించడానికి ఎక్కువగా ఇష్టపడరు.
గతంలో ప్రముఖ రాజకీయ నేత కూతురును ప్రదీప్ మ్యారేజ్ చేసుకుంటారని వార్తలు వైరల్ కాగా ప్రదీప్ ఆ వార్తల గురించి స్పందించడానికి ఇష్టపడలేదు.తాజాగా ఒక షోలో ప్రదీప్ పెళ్లి గురించి సునీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బుల్లితెర మేల్ యాంకర్లలో నంబర్ 1 యాంకర్ అయిన ప్రదీప్ రేడియో జాకీగా కెరీర్ ను మొదలుపెట్టి బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే వెండితెరపై సినిమాల్లో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు.ప్రదీప్ చేసిన షోలకు మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుండటంతో అన్ని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో యాంకర్ గా ప్రదీప్ కు అవకాశాలు వస్తుండటం గమనార్హం.30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో ప్రదీప్ హీరోగా కూడా సక్సెస్ అందుకున్నారు.
ప్రస్తుతం ప్రదీప్ హోస్ట్ గా డ్రామా జూనియర్స్ పేరుతో ఒక షో ప్రసారం కానుండగా ప్రోమోలో పిల్లలు మార్కండేయుని స్కిట్ చేశారు.
శివుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటావని సునీత బుడ్డోడిని అడగా ప్రదీప్ అన్నకు పెళ్లి కావాలని కోరుకుంటానని బుడ్డోడు చెబుతాడు.సునీత మరో బుడ్డోడు అమ్మాయిలు డేంజర్ అంటూ కామెంట్ చేయగా ఇక్కడ ఎంతమంది ఆడోళ్లు ఉన్నారో చూశావా.? బయటకు వెళ్లాలని ఉందా.? అని అడుగుతారు.
ప్రదీప్ వెంటనే నేను చెప్పింది అమ్మాయిల గురించి అని చెప్పు అని బుడ్డోడికి చెప్పగా ఈ స్టేట్ మెంట్ డ్యామేజింగ్ స్టేట్ మెంట్ అని అందుకే ప్రదీప్ కు పెళ్లి కావడం లేదని సునీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సునీత కామెంట్లకు స్పందిస్తూ ఇది పెద్ద డైలాగ్ అని ప్రదీప్ అన్నారు.