ఈ ఫోటోలో ఎంతో ప్రశాంతమైన, కల్మషం లేకుండా నవ్వులు కురిపిస్తున్నటువంటి చిన్నారిని గుర్తుపట్టారా.? బాగా చూసి ఈ చిన్నారి ఎవరు చెప్పండి చూద్దాం.ఎంతో అందంగా ముద్దుగా ఉన్నటువంటి ఈ చిన్నారి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో ఒకరు.ఈమె వెండితెర పై ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన సందడి చేసింది.
ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్న ఈ చిన్నారి ఎవరో కనుక్కోవడానికి ప్రయత్నించండి.
ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ పక్కన నటించిన ఈ హీరోయిన్ కి ప్రస్తుతం ఇండస్ట్రీలో యమ క్రేజ్ ఉంది.
గత కొద్ది రోజుల నుంచి సెలబ్రెటీల చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ క్రమంలోనే ఈ చిన్నారి ఫోటోకూడా వైరల్ గా మారడంతో అభిమానులు ఎవరో గుర్తుపట్టండి చూద్దాం అంటూ ఫజిల్ మాదిరి అందరికీ షేర్ చేస్తూ తమ మెదడుకు పదును పెడుతున్నారు.
ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నది ఎవరు గుర్తు పట్టలేక పోతున్నారా.అయితే మీకోసం ఒక చిన్న క్లూ.
ఈ ఫోటోలలో ఎంతో ముద్దు ముద్దుగా ఉన్నటువంటి ఈ చిన్నారి ప్రస్తుతం ఇండియా హీరోయిన్ స్థాయిలో సినిమాలు తీస్తోంది.ఈ హీరోయిన్ తీసిన సినిమా కోసం దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడైనా ఈ చిన్నారి ఎవరో గుర్తుకు వచ్చిందా? ఈ ఫోటోలలో ఎంతో అందంగా ముద్దుగా ఉన్నటువంటి చిన్నారి మరెవరో కాదు మన బుట్ట బొమ్మ పూజా హెగ్డే.చిన్నప్పుడు పూజాహెగ్డే ఎంతో ముద్దుగా బొద్దుగా ఉండేది.ప్రస్తుతం ఈమె సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.ఇక ఈమె ప్రభాస్ సరసన నటించిన “రాధేశ్యామ్” అనే పాన్ ఇండియా చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అదేవిధంగా అఖిల్ సరసన నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇదివరకే మహేష్ బాబు సరసన “మహర్షి”లో కలిసి సందడి చేసిన పూజా హెగ్డే ఆ తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.