ఒక్కోసారి కొంతమంది హీరోయిన్లకి అందం, అభినయం, నటన ప్రతిభ వంటివి మెండుగా ఉన్నప్పటికీ సరైన హిట్లు లేకపోవడంతో గుర్తింపుకు నోచుకోక లేకపోతుంటారు.కానీ ఉన్నట్టుండి వీరికి సరైన హిట్ పడితే మాత్రం కెరీర్ బాగానే ఊపందుకుంటుంది.
కాగా ఆ మధ్య తమిళంలో ప్రముఖ హీరో విజయ్ హీరోగా నటించిన “మాస్టర్” చిత్రంలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన యంగ్ బ్యూటీ “మాళవికా మోహనన్” కూడా ఈ కోవకే చెందుతుంది.
కాగా ఈ అమ్మడు మాస్టర్ చిత్రంలో నటించడానికంటే ముందుగా దాదాపుగా ఐదుకి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.
కానీ ఆ చిత్రాలు ఈ అమ్మడి కెరియర్ కి పెద్దగా ఉపయోగపడలేదు.కానీ మాస్టర్ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడి సినిమా కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.
ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.
అయితే ఈ మధ్య కాలంలో మాళవికా మోహనన్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటింది.
ఈ క్రమంలో అప్పుడప్పుడు పలు ఫొటోషూట్ కార్యక్రమాల్లో దిగిన ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది.కాగా ఇటీవలే మాళవికా మోహనన్ క్లీవేజ్ షో చేస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.
దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడి అందాల ఆరబోతకి నెటిజన్లు ఫిదా అయ్యారు.అంతేకాకుండా ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా 20 లక్షల పైచిలుకు మంది నెటిజన్లు లైక్ చేశారు.
దీనికితోడు ఎప్పుడూ సాంప్రదాయబద్దంగా చీర దుస్తులలో కనిపించే మాళవికా మోహనన్ ఒక్కసారిగా ఎద అందాలను ఆరబోస్తూ గ్లామర్ షో చేయడంతో సినిమా అవకాశాల కోసం మాళవికా మోహనన్ గ్లామర్ డోస్ పెంచిందంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 26 లక్షల పైచిలుకు నెటిజన్లు ఫాలో అవుతున్నారు.దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు మాళవికా మోహనన్ కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి.
కాగా ప్రస్తుతం మాళవికా మోహనన్ తమిళంలో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న “మారన్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే ప్రముఖ హీరో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటిస్తున్న “యుద్ర” అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.