జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ తరుచుగా వినిపిస్తూనే ఉంది.ఆయన వస్తేనే టీడీపీ కి మళ్లీ పునర్వైభవం వస్తుంది అంటూ టీడీపీ యువ నాయకులతో పాటు , ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూనే వస్తున్నారు.
అనేక సందర్భాల్లో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ముందు ఈ తరహా నినాదాలు చేశారు.అయితే ఎన్టీఆర్ మాత్రం తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదు అంటూ స్పష్టంగా ప్రకటించారు.
చంద్రబాబు ఎన్టీఆర్ ప్రస్తావన పార్టీలో రాకుండా జాగ్రత్త పడుతూనే వస్తున్నారు.లోకేష్ ను సమర్ధుడైన రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయినా ఏదో ఒక సందర్భంలో చంద్రబాబు ముందే ఎన్టీఆర్ ప్రస్తావన వస్తోంది.తాజాగా మచిలీపట్నంలో ఈ తరహా వ్యవహారం చోటుచేసుకుంది.మచిలీపట్నంలో ఇటీవల చనిపోయిన టిడిపి నేత కాగిత వెంకట్రావు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు.ఈ సందర్భంగా చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది.
భారీ ఎత్తున టిడిపి శ్రేణులు చంద్రబాబు పర్యటనలో కనిపించారు.

వారితో పాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీగా చంద్రబాబు పర్యటన కు వచ్చారు.అక్కడ టిడిపి తో పాటు ఎన్టీఆర్ జెండాలను ప్రదర్శించారు.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ చంద్రబాబుకు వినబడే విధంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
కొద్ది రోజుల క్రితం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఈ తరహా చేదు అనుభవం చంద్రబాబు ఎదురయింది.

అలాగే ప్రకాశం జిల్లాలోనూ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం వంటివి జరిగాయి.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఈ విధంగా పదేపదే వస్తుండడం చంద్రబాబుతో పాటు లోకేష్ కు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది.ఎన్టీఆర్ ప్రస్తావన రాకుండా చూసేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆయనను ఏదోలా టీడీపీలో యాక్టివ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు గానే కనిపిస్తున్నారు.