అగ్ర రాజ్యం పై ఆధిపత్యం ...ఆందోళనలో అమెరికన్స్..!!

అగ్ర రాజ్యంపై ఆధిపత్యమా.అంతటి ధైర్యం ఎవరికి ఉంది, రష్యా, చైనా లు అమెరికాపై పై చేయి సాధించాలని కుట్రలు పన్నాయా అంటూ ఊహించకండి.

 Delta Variant Cases Increased In America, Americans, Delta Variant Cases, Corona-TeluguStop.com

అగ్ర రాజ్యం పై ఆధిపత్యం చెలాయిస్తోంది డెల్టా వేరియంట్ మహమ్మారి.అమెరికాలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదు అవడంతో ఆదేశ ప్రజలు భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయోనని ఆందోళన చెందుతున్నారు.

అమెరికా వ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల్లో దాదాపు 52 శాతం కేసులు కొత్త వేరియన్ అయిన డెల్టాకు చెందినవేనని అమెరికా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.

అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో అయితే డెల్టా వేరియన్ కేసులు 80 శాతం పైగానే నమోదు అవుతున్నాయట.

అంతేకాదు గతంలో అక్కడక్కడా నమోదయిన ఆల్ఫా కేసుల సంఖ్య ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా 29 శాతం ఉన్నాయని కూడా తెలిపింది.ఈ విషయంపై స్పందించిన అమెరికా అంటువ్యాధుల నిపుణుడు, అధ్యక్షుడు వైద్య సలహాదాలు ఆంటోని ఫౌచీ రానున్న రోజుల్లో అమెరికా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని ప్రకటించారు.

అమెరికాలో డెల్టా వేరియన్ సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో ప్రతీ ఒక్కరూ వ్యాక్సినేషన్ తప్పకుండా వేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

Telugu Americans, Anthony Fauci, Corona, Covid Vaccine, Delta, Delta America-Tel

ఈ కొత్త వేరియంట్ ఉదృతంగా పెరుగుతోందని, అంతేకాకుండా, ఒక్క సారి సోకితే తీవ్ర ప్రభావాన్ని చూపెడుతోందని, ఈ పరిస్థితుల నుంచీ ప్రజలు బయటపడాలంటే కేవలం వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ప్రజలకు ఫౌచీ సూచించారు.ఇదిలాఉంటే వ్యాక్సినేషన్ రెండవ సారి తీసుకున్న వారికి కూడా వైరస్ వస్తోందని కానీ అలా వచ్చే మహమ్మారి పాలయ్యే వారి సంఖ్య అతి తక్కువగా ఉందని తెలిపారు.అయితే పిల్లల విషయానికి వస్తే తల్లి తండ్రులు ప్రత్యేకమైన శ్రద్ద చూపించాలని, 15 ఏళ్ళ వయసు పిల్లలలో ప్రతీ ముగ్గురిలో ఒకరు టీకా తీసుకున్నారని, 15 నుంచీ 17 ఏళ్ళ లోపు పిల్లలలో ప్రతీ ముగ్గురిలో ఒకరు మాత్రమే టీకా తీసుకున్నారని, కానీ ఎక్కువ మంది వ్యాక్సినేషన్ తీసుకుంటేనే ఈ మహమ్మారి నుంచీ బయటపడగలమని ఫౌచీ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube