రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలకు ప్రముఖ టీవీ జర్నలిస్ట్ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎంతోమంది ప్రముఖుల భాగోతాలను బయటపెట్టి మూర్తి వార్తల్లో నిలిచారు.
మార్చి నెలలో విడుదలైన ప్లే బ్యాక్ సినిమాలో మూర్తి నటించి నటుడిగా కూడా మెప్పించడం గమనార్హం.ప్రస్తుతం ఒక ప్రముఖ ఛానెల్ లో పని చేస్తున్న మూర్తి ఆ ఛానల్ షోలలో గత కొన్నిరోజుల నుంచి కనిపించడం లేదు.
ఆ ఛానల్ నుంచి మూర్తి బయటకు వెళ్లిపోయారని, మూర్తిని బయటకు పంపించారని, మూర్తి నిధుల దుర్వినియోగం చేశారని అనేక వార్తలు ప్రచారంలో వచ్చాయి.అయితే తాజాగా మూర్తి ఛానల్ లోకి రీఎంట్రీ ఇవ్వడంతో పాటు తన గురించి వైరల్ అయిన వార్తలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను వ్యక్తిగత సమస్యలు, ఆ సమస్యల పరిష్కారం కొరకు లీవ్ తీసుకున్నానని మూర్తి చెప్పుకొచ్చారు.
తాను రిజైన్ చేయలేదని, వ్యవసాయం కూడా చేయలేదని వ్యవసాయం చేయాలంటే భూమి ఉండాలి కదా.? అని నాకు సెంటు భూమి కూడా లేదని మూర్తి అన్నారు.
నేను వెళ్తే కూలిపని లేదా కౌలు చేసుకోవాలని మూర్తి పేర్కొన్నారు.వ్యక్తిగత విషాదం జరగడం వల్ల తాను విరామం తీసుకున్నానని అంతకు మించి ఏమీ జరగలేదని మూర్తి చెప్పుకొచ్చారు.తన లైఫ్ లో నిధుల దుర్వినియోగం అనే అవకాశమే రాదని మూర్తి తెలిపారు.
తాను ఎడిటోరియల్ జర్నలిజం మాత్రం చేస్తానని మూర్తి అన్నారు.తనపై ప్రేమాభిమానులు చూపుతున్న వారికోసం వివరణ ఇస్తున్నానని మూర్తి అన్నారు.తనపై రాజకీయ ఒత్తిళ్లు ఎప్పటినుంచో ఉన్నాయని మూర్తి చెప్పుకొచ్చారు.ప్రతిరోజు ఇదే తన మొదటి షో ఆఖరి షో అనుకుంటానని మూర్తి తెలిపారు.తనపై వైరల్ అవుతున్న ట్రోల్స్ కు మూర్తి వివరణతో చెక్ పెట్టారు.